
ఇంటలిజెన్స్ గంగాధర్ కు ఉత్తమ సేవా పతకం
జగిత్యాల ప్రతినిధి :
పోలీస్ శాఖ లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను నూతన సంవత్సరం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవా పతకాలకు వివిధ శాఖలలో పని చేస్తున్న రాష్ట్ర పోలీసులకు (లా అండ్ ఆర్డర్, ఇంటలిజెన్స్, ఎస్బి, ఎస్ ఐ బి, ఐటీ సెల్, సీఐడి) అధికారులు, సిబ్బందిని హోం శాఖ ఎంపిక చేసింది.కాగా ఇంటలిజెన్స్ కరీంనగర్ జోన్ లోని జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం తోపాటు జిల్లా కేంద్రం బాధ్యతలు నిర్వహిస్తున్న ఇంటలిజెన్స్ ఫీల్డ్ ఆఫీసర్ వావిలాల. గంగాధర్(హెచ్. సి 1652)ను ప్రభుత్వం అందజేసే ఉత్తమ సేవా పతకం తోపాటు రూ. 30,000/- నగదు రివర్డ్ కు ఎంపికయ్యారు. విధినిర్వహణలో హెడ్ కానిస్టేబుల్ వి.గంగాధర్ ఇంటెలిజెన్స్ పోలీస్ వృత్తి రీత్యా ఎక్కువగా ప్రజాసంబంధాల్లో ఉండడం వృత్తిలో నిబద్దత,ఉత్తమ ప్రతిభ కనబర్చడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయనను ఈ పతకానికి ఎంపిక చేసినట్లు తెలిసింది. హెడ్ కానిస్టేబుల్ వి. గంగాధర్ గతంలో అనేక సేవా పతకాలు అందుకోగా విధినిర్వహణలో నైపుణ్యం అంకితభావంతో ఆయన చేసిన పనికి ఉన్నతాధికారుల మన్ననలను కూడా పొందారు.అయితే గంగాధర్ ఉత్తమ సేవా పతకానికి ఎంపిక కావడం పట్ల ఇంటెలిజెన్స్ కరీంనగర్ జోనల్ ఇన్స్పెక్టర్ బి. రాజేందర్, ఎస్సై వెంకటయ్య లు అభినందించగా ఫీల్డ్ ఆఫీసర్లు ఎం. శ్రీనివాస్ ,రషీద్, నయీమ్,రాము,సాగర్, రైటర్ రియాజ్ లు శుభాకాంక్షలు తెలియజేసారు.