logo

అంగ వైకల్యాన్ని జయించిన భానుమతి

ప్రతి మనిషిలోనూ తెలియని శక్తి ఉంటుంది అంటారు. కాని ఆ శక్తి ని వెలికితీయకపోతే నిర్వీర్యమైపోతుంది. ఏవో అడ్డంకులు ఉన్నాయి అనుకుంటూ పబ్బం గడుపుకునే వాళ్ళకి కనువిప్పు కలిగేలా కొందరి కధలు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పబోతున్న కధ అంగ వైకల్యాన్ని జయించి చిత్రలేఖనం లో అద్భుత ప్రతిభ కనబరచిన శ్రీమతి కాశీ బొట్ల భానుమతి కధ.
1978 లో గోదావరి ఎక్సప్రెస్ లో ఆకోండి సోమశేఖర్ శర్మ ,లలిత దంపతులకి పుట్టిన మధ్యమ సంతానం భానుమతి. అందరిలాగే పుట్టి ఆటపాటలతో సంతోషం గా ఉన్న సమయం లో పోలియో సోకి కుడి చెయ్యి , కుడి కాలు సరిగా పెరగలేదు. అందర్లో కలవలేక చదువులో వెనుకబడకుండ , శర్మ గారు.. నువ్వు నాకు పుట్టిన వరం అమ్మ అంటూ తన బాధ ని తెలియనివ్వకుండా పెంచారు ఆ పుణ్యదంపతులు.
బాల్యం లోనే ఎడమ చేత్తో చిత్ర లేఖనం లో భానుమతి ప్రతిభ గమనించి తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహించారు . భానుమతి ఎంతో ఆకుంఠిత దీక్షతో చిత్రలేఖనం లో పరిణతి సాధించి జిల్లాస్తాయి పోటీలలో ప్రధమ బహుమతి పొందింది. ఈనాడు ఆదివారం పుస్తకం లో భానుమతి గురించి చక్కని వ్యాసం కూడా ప్రచురితమైంది. చదువులో కూడా మేటి అయి బి.ఏ. పట్టా చేతబూనింది.
శ్రీకాశీబొట్ల సుందరరావు గారిని వివాహం చేసుకుని మెట్టినింటిలో కూడా భర్త ప్రోత్సాహం తో చిత్రలేఖనం లో తన విజయబావుట ఎగరెసింది భానుమతి. అంతే కాక పాటల్లో కూడా ప్రావీణ్యం సంపాదించి తనకు భగవంతుడు ఇచ్చిన తమ్ముడు శ్రీ రవికాంత్ గారి ప్రోత్సాహం తో smule app లో కూడా తనదైనా ముద్ర వేసుకున్నది. ఇది శ్రీమతి కాశీబొట్ల భానుమతి కధ ...ఏమి చేయలేకపోతున్నాము అని బాధపడే వారికి చక్కని ఆదర్శం. తన లాంటి వారిని పెద్ద మనసు తో ప్రోత్సహిద్దాం .
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏

155
8191 views