వేటపాలెం బైపాస్ పై చెక్ పోస్ట్ అక్రమ బుసక పై నిఘా - వేటపాలెం ఎస్సై
ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, చీరాల నియోజకవర్గం లో , వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాలపై వేటు వేసిన వేటపాలెం ఎస్సై వెంకటేశ్వర్లు. వేటపాలెం బైపాస్ లో అక్రమ బుసకపై చెక్కు పోస్ట్ పెట్టి రెవిన్యూ సిబ్బంది మరియు పోలీసు సిబ్బంది కలిసి నిఘా వుంచారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమ ఇసుక తరలిస్తే ట్రక్టర్ యాజమాన్యం పైన కేసు నమోదు చేసి ట్రక్టర్ని సీజ్ చేస్తానని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. అక్రమ ఇసుక తరలిస్తే ప్రజలు తమను సంప్రదించాలని కోరారు.