logo

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నడ్డివిరిచే కార్యక్రమం విడనాడాలని

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల నడ్డివిరిచే కార్యక్రమం విడనాడాలని కోరారు వైసీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి . ఎన్నికల ముందు అధికారమే పరమావధిగా అసత్య హామీలను గుప్పించి నేడు ఆ హామీలను తుంగలో తొక్కి ప్రజలపై కరెంట్ భారాన్ని మోపిన చంద్రబాబు వెనక్కు తగ్గాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ పై అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ స్ధానిక కట్టమంచి వివేకానందరెడ్డి విగ్రహం నుండి గాంధీ రోడ్డున గల విద్యుత్ సబ్ డివిజన్ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి అక్కడి అధికారులకు ప్రజల పై భారాన్ని ఎత్తివేయాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున చిత్తూరు మునిసిపల్ కార్పొరేషన్ నాయకులు , గుడిపాల , చిత్తూరు రూరల్ మండల నాయకులు , రైతులు , విద్యార్థులు , మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

12
931 views