logo

తిరుమల శ్రీవారిపై కంచె ఐలయ్య వివాదస్పద వాక్యలు!

ప్రొఫెసర్ ఐలయ్య ఇటీవల మహబుబాబాద్ జిల్లా గూడురులో దొడ్డి కొమరయ్య విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా హజరయ్యారు. అక్కడ దొడ్డికొమురయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇంత వరకు బాగానే ఉంది.. కానీ ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. మహిళా విశ్వవిద్యాలయానికి తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరు పెట్టడం తప్పేమీ కాదన్నారు. ఆమె యోధురాలని, తెలంగాణలో సాయుధ పోరాటంలో పాల్గొన్నారని అన్నారు.

అదే సమయంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి పేర్లు యూనీవర్సీటీలకు ఎందుకటి.. వారికి ఏమైన చదువొచ్చా.. ఏదైన సంఘ సంస్కరణ పనులు చేశారా.. అంటూ నోటీకోచ్చినట్లు మాట్లాడారు. దీంతో ఈ ఘటన కాస్త వివాదం రాజేసిందని చెప్పుకొవచ్చు. దీనిపై శ్రీవారి భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారంట.
వెంటనే ప్రొఫెసర్ ఐలయ్యపై చర్యలు తీసుకొవాలని డిమాండ్ చేస్తున్నారంట. గతంలో.. కంచె ఐలయ్య..రాసిన సామాజిక స్మగ్లర్లు.. కోమటోళ్లు అనే బుక్ తెలుగు రాష్ట్రాల్లో వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కంచె ఐలయ్య మరోవివాదంను రాజేసినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తొంది.

0
179 views