క్రీడలతోనే మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది*
--- *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల*
తెలంగాణ స్టేట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
డిసెంబర్ 22
క్రీడలతోనే మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది*
--- *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల*
క్రీడలతోనే దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసం ఏర్పడుతాయని *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు.
పాల్వంచ *KTPS బాస్కెట్ బాల్ గ్రౌండ్ లో హర్ష, ప్రణీత్ మెమోరియల్* ఆధ్వర్యంలో *12 వ జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ టోర్నీని* నిర్వహించారు.
ఆదివారం ఈ టోర్నీని *కొత్వాల* ప్రారంభించారు. ఈ సందర్భంగా *కొత్వాల* మాట్లాడుతూ ప్రతిరోజూ వ్యాయామం, నడకలతో పాటు ఆటలాడటం ద్వారా మనస్సుకు ఆరోగ్యమైన ప్రశాంతత చేకూరుతుందన్నారు. విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చాటి, జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందాలనై *కొత్వాల* అన్నారు.
ఈ కార్యక్రమాల్లో *జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు Dr G యుగంధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు Y వెంకటేశ్వర్లు, మాజీ ZPTC సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య, మెమోరియల్ నిర్వాహకులు కటిక శ్రీనివాస్, నాని, హిమ వరుణ్, విజయ్, మన్సూర్, నాగరాజు, ఉప్పుశెట్టి రాకేష్, సురేష్, కాంగ్రెస్ నాయకులు కందుకూరి రాము, యాకుబ్*, తదితరులు పాల్గొన్నారు.