logo

హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఖండించిన జేఏసీ నాయకులు

ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం రోజున కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై భగ్గుమన్న అఖిలపక్షం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాళ భాషా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంటులో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు దేశవ్యాప్తంగా ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయని వారు ఆరోపించారు. ఈరోజు చట్టసభలలో చట్టాలను ఏర్పాటు చేయడానికి అవసరమైన రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హర్షించదగినవి కావని వారు ఘాటుగా విమర్శించారు. తక్షణమే కేంద్ర హోం మంత్రి భారత దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పి స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ బీరువాల భాష, రాష్ట్ర మాల మహానాడు రామోజీ వర్గం నాయకులు పెన్నం సుధాకర్, ఓబులేసు, కాంగ్రెస్ పార్టీ నాయకులు బరగొడ్ల హుస్సేన్ భాష, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెక్రటరీ శంషుల్ హక్, డాక్టర్ వెస్లీ, గోల్డ్ స్మిత్ హసన్, హ్యూమన్ రైట్స్ సంస్థ ప్రతినిధి ప్రముఖ న్యాయవాది హాజీ గౌస్, బ్యాటరీ బాజాన్, మెకానిక్ గౌస్ పీర్, షేర్ షాష వలి, అబ్దుల్ ఖాదర్, హసన్, హఫీజ్ ఇలియాస్, మసిఉల్లా వికలాంగు ల ఆదరణ సేవా సమితి సభ్యులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

8
2178 views