logo

దయచేసి ఆహారాన్ని వృధా చేయకండి ఆహారం మిగిలి ఉంటే సమాచారం ఇవ్వండి...


గుంటూరు,డిసెంబర్ 21

దయచేసి ఆహారాన్ని ఇలా చేయకుండానే ఫంక్షన్లలో ఆహారం మిగిలి ఉంటే తమకు సమాచారం ఇవ్వండని, కలియుగములో అన్నదానము మోక్షానికి మార్గమని జన చైతన్య సమితి కార్యదర్శి తుల్లూరి సాంబశివరావు అన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు కు చెందిన నాదెండ్ల తులశ మ్మ గృహంలో జరిగిన ఫంక్షనలో మిగిలిన ఆహారాన్ని శుక్రవారం రాత్రి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు ప్రభుత్వ వైద్యశాల వద్దకు వెళ్లి భోజనాన్ని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా యువజన సంఘం నాయకులు గుడిపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆహారాన్ని వృధా చేయవద్దని మిగిలిన ఆహారం గురించి సమాచారం ఇస్తే ఆ ఆహారాన్ని తెచ్చి పేదలకు పెడతారని వివరాలకు 888677 7767,9848977677 నంబర్లకు సమాచారం ఇవ్వొచ్చని అన్నారు.ఈ కార్యక్రమంలో జన చైతన్య సమితి ప్రతినిధులు బెజ్జం నాగేశ్వరరావు, గోగులపాటి దాసు, దాసరి విజయ్ బెన్ని బాబు, సయ్యద్ ఖాసిం భాష తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా 150 మందికి మిగిలిన ఆహారాన్ని పంపిణీ చేశారు. చపాతి,వడ,ఇడ్లీలను కూడా ఈసందర్భంగా 60 మందికి పంపిణీ చేశారు

5
971 views