logo

రైతుల నుండి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం.


*రైతుల నుండి చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం.

*తేమ శాతం 24 నుండి 14 శాతానికి తగ్గించాం.

*ఇప్పటి వరకు రాష్ట్రంలో 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 3.28 లక్షల మంది రైతుల నుండి కొనుగోలు చేశాం.

*ఇంటర్మీడియట్ విద్యార్థులకు జనవరి 1 నుండి మధ్యాహ్నం భోజనం.

*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

శ్రీకాకుళం/టెక్కలి,డిశంబరు,21: రాష్ట్రంలో ఉన్న రైతుల నుండి చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, పశు సంవర్థక, డెయిరీ అభివృద్థి మరియు మత్య్సశాఖామాత్యులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. టెక్కలి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతు ఆనందంగా ఉన్న రాష్ట్రం బాగుంటుందని అందరూ పలుకుతారని, దానిని ఆచరణలో కూటమి ప్రభుత్వం చేసి చూపించామన్నారు. ఐదు సంవత్సరాలుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించి రైతులకు నెలల తరబడి నగదు జమ చేయలేదన్నారు. గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలుగా అధికారంలో ఉండి వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా 13 లక్షల కోట్ల అప్పులు చేసినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అధికార వ్యవస్థను గాడీలో పెట్టమన్నారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి 22 పార్లమెంటు స్థానాలు ఇచ్చినందు వలన రాష్ట్రానికి కేంద్రంలో విలువ పెరిగినట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యవేక్షణలో రిజర్వాయర్ లలో 95 శాతం నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు, ఆ విధంగా వాటర్ మేనేజ్ మెంట్ చేసినట్లు చెప్పారు. ఖరీఫ్ లో విత్తనాలు, ఎరువులు, రుణాలు, పంటలకు అవసరమైన వాటిని సరఫరా చేసినట్లు చెప్పారు. జిల్లాలోని కాలువల ద్వారా గత ప్రభుత్వం హయాంలో ఏనాడైనా పలాసకు నీరు వెళ్లడం రైతులు ఎప్పుడైనా చూశారా అని, చిట్టచివరి సెంటు వరకు నీరు ఇచ్చామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలాస రైతులకు సాగునీరు అందించినట్లు పేర్కొన్నారు. రైతాంగానికి స్పష్టమైన హామీ ఇస్తున్నానని, చివర గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటికి 1600 వందల కోట్లు ధాన్యం బకాయిలు ఉండగా వాటిని కూటమి ప్రభుత్వం తీర్చినట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ధాన్యాన్ని నిమిషాల్లో కొనుగోలు చేసి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, 3.28 లక్షల మంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసినట్లు చెప్పారు. 4,865 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. వ్యవసాయానకి కూలీలు దొరకడం లేనందు వలన నేటి కాలంలో యాంత్రీకరణ వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. ప్రస్తుతం మిషన్లతో ధాన్యాన్ని కోసి ధాన్యాన్ని వేరు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచించి ధాన్యం 24 తేమ శాతంను 14 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. కురుస్తున్న వర్షాలకు ధాన్యం పాడైపోయే అవకాశం ఉందన్నారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు. అన్నధాత సుఖీభవ కింద 20 వేల రూపాయలు రైతులకు ఇస్తామన్నారు. 2014లో ఏ విధంగా రైతులకు భీమా వుండేదో అలాంటి భీమాను రానున్న రబీలో భీమా ఏర్పాటు చేస్తామన్నారు. టెక్కలిలో 2014-19లో తాను వేసిన రోడ్లు తప్ప కొత్త రోడ్లు లేవని, రోడ్లను యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి సంక్రాంతి నాటికి పూర్తి చేస్తామని చేప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ లో హామీలలో ఒకటి ఒకటి అమలు చేస్తున్నట్లు వివరించారు. పెన్షన్ పొందుతున్న భర్త మరణిస్తే భార్యకు వెంటనే ఫించను వస్తుందన్నారు. అనివార్య కారణాల వలన పెన్షన్ తీసుకోకపోతే
మూడు నెలలకు ఒక సారి పెన్షన్ తీసుకోవచ్చునని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి ఒక వైపు, సంక్షేమం ఒక వైపు నడుస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతిలో పెట్టుబడి పెడితే అన్ని ప్రాంతాలకు దాని ప్రతి ఫలం వస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కు గాడీలో పెట్టమన్నారు. విద్యా వ్యవస్థలో మళ్లీ పాత విధానాన్ని తీసుకువస్తామన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం జనవరి 1 నుండి ప్రారంభిస్తామని వెల్లడించారు. జిల్లాలో మూలపేట పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పోర్టుకు అనుబంధంగా టూరిజం, పరిశ్రమలు, తదితరమైనవి అభివృద్ధి చెందుతున్నారు. 60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. భోగాపురం నుండి మూలపేట పోర్టు వరకు నాలుగు లైన్ల రోడ్డుకు డిపిఆర్ తయారు చేసినట్లు పేర్కొన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం వలన పర్యాటక రంగం అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. టెక్కలిని మరింత అభివృద్ధి చేస్తామని, టెక్కలి ప్రజలు సహకరించాలని కోరారు. టెక్కలిలో ఉన్న రహదారులను ఒకటీ ఒకటీ అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా పనులు చేపడతామన్నారు. ఏలాంటి కక్షలు ఉండవన్నారు. భూ కబ్జాలకు పాల్పడితే ల్యాండ్ గ్రేబింగ్ చట్టం ద్వారా కఠిన చర్యలు ఉంటాయన్నారు. జగతిమెట్టలో పేదలకు కేటాయించిన స్థలాలకు సంబంధించి అక్రమాలను వెలికి తీస్తామన్నారు.

1
0 views