logo

పలాస లో మర్డర్ చేసేందుకు వచ్చిన.. గ్యాంగ్ అరెస్ట్..

AIMA MEDIA :డిసెంబర్ 21:శనివారం
న్యూస్ 9:- ఏపీ శ్రీకాకుళం జిల్లా. పలాస పట్టణ పరిధిలో డబ్బులు కోసం ఎంత పని అయినా చెయ్యడానికి వెనకాడ లేదు. డబ్బే జగత్ కి మూలం. అవసరం కోసం ఎంత రిస్క్ అయినా చేయ్యుస్తుంది డబ్బు... చివరి కు ఒక ప్రాణం తీయ్యమని కూడా డబ్బు తో కొనాలి అనుక్కున్నరు కొందరు మహానుభావులు. పలాస -కాశిబుగ్గా అనే పట్టణాలు ట్విన్స్ సిటీలు, ఇక్కడి ప్రజలు ఎప్పుడు సోదర, స్నేహ బావాలు కల్గిన పట్టణమ్ లో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ అయ్యాయి. ఇంతకు ముందు అన్నా, తమ్ముడు, మామ -భావ అనుకునే వాళ్ళు ఇప్పుడు, వాడు ఎంత..? వాడు బతుకు ఎంత..? అంటున్నారు. అయితే పలాస పోలీస్ స్టేషన్ పరిధిలో బీహార్ గ్యాంగ్ కొన్ని రోజులు గా తిరుగుతూ ఉన్నారు అని గ్రహించిన క్రైమ్ పోలీసులు, అ గ్యాంగ్ పట్టుకొని విచారణ చెయ్యగా.. పెద్ద నిజం బయట పడింది. అది ఏమిటంటే.? నాగరాజు అనే వ్యక్తిని చంపడానికి బీహార్ నుండి వచ్చాము అని చెప్పారు. మేము మొత్తం 9 మంది అని పక్కా ప్లాన్ ప్రకారం పని పూర్తి చేసి మేము వెళ్లిపోవడం అని తెలిపారు. ఈ విషయం జిల్లా ఎస్పి, మహేశ్వర రెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు. అంతే కాకుండా. వాళ్ళు వద్ద మూడు తుపాకీ లు, అందులో 49 తుటాలు, ఒక కారు, పది కత్తులు, స్వాధీనం చేసుకున్నాం అని తెలిపారు. నాగరాజు ని 20 లక్షలు చంపడానికి తీసుకున్నారు.అందులో 10 లక్షలు క్యాష్ అడ్వాన్స్ రూపంలో ఇచ్చారు అని తెలిపారు. మరో కొన్ని రోజుల్లో నాగరాజు ని చంపడానికి ప్లాన్ చేసుకున్నారు అని ఈ గ్యాంగ్ ను పట్టుకోపోతే పలాస లో ఒక మర్డర్ జరిగేది అని ఎస్పి మహేశ్వర రెడ్డి తెలిపారు. ఇంకా పూర్తి విచారణ చేస్తాము అని, ఇంకా కొందరు నిందుతులు తెలివి గా తప్పించు కున్నారు. అయితే ఎవ్వరిని వదిలి పెట్టేది లేదని తెల్సిచెప్పారు.

15
2007 views