logo

నంద్యాల జిల్లా: బాల అకాడమీ పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవపు వేడుకలు.

నంద్యాల జిల్లా :
పార్కు రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో డిసెంబర్ 21వ తేదీన అనగా శనివారం ముందస్తుగా జాతీయ గణిత దినోత్సవమును ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరెస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ శ్రీమతి మాధవీలత మరియు అపుస్మా కి ట్రెజరరీ మరియు కృష్ణ పబ్లిక్ స్కూల్ కొత్తపల్లి కరస్పాండెంట్ పాల్గొన్నారు. గత 25 సంవత్సరాలుగా తక్కువ ఫీజులతో పిల్లలకు విద్యను అందిస్తున్న వ్యక్తి శ్రీ గంధం. వెంకటరమణయ్య గౌడ్ విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ 20వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన గణిత మేధావుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన అపర మేధావి అయిన శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న తమిళనాడులోని ఈరోడ్ లో జన్మించారు కఠిన పేదరికం అనుభవించిన ఆయన ఏనాడు లెక్కల్ని మాత్రం వదల్లేదు ప్రతిక్షణం వాటిని ఆలోచిస్తూ వాటిని చేయిస్తూ అవి జీవితం గలుచుకున్నారు ఆయన ఆలోచనలు చేసిన లెక్కలు వేసిన ఫార్ములాలు అన్ని ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి అందుకే గణితశాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జయంతిని జాతీయ గణిత దినోత్సవం గా జరుపుకుంటున్నాము. ఆయన మ్యాథ్స్ జీనియస్ గా కూడా పేరు పొందారు అని తెలియజేస్తూ ఉపాధ్యాయులకు విద్యార్థులకు మరియు గణిత మేధావులు అందరికీ ఘనత దినోత్సవపు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమ గంధం వెంకట రమణయ్య గౌడ్ ని పాఠశాల సీనియర్ గణిత ఉపాధ్యాయుడైన లక్ష్మీనారాయణకి మరియు గణిత ఉపాధ్యాయులైన అజీజ్ శాంతి శేఖర్, అంజనాదేవి , పావనీలను సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు గణితమునకు సంబంధించిన అనేక అంశాలను తమదైన శైలిలో ప్రాజెక్టు రూపంలో తయారుచేసి ముఖ్య అతిధులను తల్లిదండ్రులను అందరిని అబ్బురపరిచారు.
ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్ మరియు ప్రిన్సిపల్ మాధవీలత మేడం ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

0
0 views