బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్
ఆళ్లగడ్డ తాలూకా సిరివెళ్ల మండలం రాజానగరం గ్రామంలో తానా అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బృందం శనివారం నాడు ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంపు నందు ముఖ్యఅతిథిగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నరు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాన్సర్ మెడికల్ క్యాంపు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగిందని ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసిన బసవతారకం హాస్పిటల్ బృందం వారికి కృతజ్ఞతలు ఈ క్యాన్సర్ స్కానింగ్ ముఖ్యంగా మహిళలు 30 సంవత్సరాల దాటిన చెక్ చేపించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను క్యాంపు ఏర్పాటుచేసిన తానా అధ్యక్షుడు నిరంజన్ కు అభినందనలు తెలిపారు