కొత్తవలసలో సెప్టిక్ ట్యాంకులో పడి చిన్నారి మృతి
అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్న సెప్టిక్ ట్యాంకులో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన శుక్రవారం కొత్తవలసలోని కంటకాపల్లిలో జరిగింది. స్థానికుల కథనం... ఊల్లో ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. ఆ సమయంలో దశ్వంత్ అటుగా వెళ్తూ గుంతలో పడిపోయాడు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గుంత నీటితో నిండి ఉంది. ఎవ్వరూ గమనించక పోవడంతో మృతి చెంది సాయంత్రానికి తేలాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.