వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు.
- సర్వమత ప్రార్థనలతో వేడుకలు ప్రారంభం
- కేక్ కట్ చేసి, పేద మహిళలకు చీరల పంపిణీ
- రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన వైయస్ఆర్ సిపి రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.
#AIMA MEDIA
Suvarnaganti RaghavaRao - Journalist
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వైయస్ జగన్ జన్మదిన వేడుకలు.
- సర్వమత ప్రార్థనలతో వేడుకలు ప్రారంభం
- కేక్ కట్ చేసి, పేద మహిళలకు చీరల పంపిణీ
- రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన వైయస్ఆర్ సిపి రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి.
#AIMA MEDIA
Suvarnaganti RaghavaRao - Journalist--తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన అభిమానుల సంబరాలతో పార్టీ కార్యాలయం కోలాహలంగా మారింది. పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, రుహుల్లా, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు పుత్తా ప్రతాప్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, హర్ష వర్ధన్ రెడ్డి, అంకంరెడ్డి నారాయణమూర్తి, కాకుమాను రాజశేఖర్, కొమ్మూరి కనకారావు, చిల్లపల్లి మోహన్ రావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాలు పలువురు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ముందుగా వైయస్ జగన్ కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు జరిగాయి. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అలాగే పార్టీ కార్యాలయం ప్రాంగణంలో గుంటూరు రెడ్ క్రాస్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. వైయస్ జగన్ పుట్టినరోజున స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చిన అభిమానులను ఆయన అభినందించారు.