జగన్ దమ్మున్న నాయకుడు
నరసన్నపేట : ఏకకాలంలోనే సంక్షేమాన్ని అభివృద్ధిని ఏకతాటి నడిపించి.. రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి పాటుపడిన దమ్మున్న నాయకుడు ఒక్క వైస్ జగన్మోహన్ రెడ్డి అని మాజీ డిప్యూటీ సీఎం శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ పేర్కొన్నారు. శనివారం నరసన్నపేట వైయస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అశేషంగా తరలివచ్చిన పార్టీ శ్రేణుల నడుమ బర్త్డే కేకు ను కట్ చేసి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని... ఆరు నెలల కాలంలోనే ప్రజలకు కూటమి ప్రభుత్వ దగా పాలన అర్థమైందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చూసి ప్రజలు అత్యాశకు పోయి గెలిపించాలని తీరా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలను పక్కన పెట్టేసిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేక సంక్షేమ పథకాలు అమలు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. స్వర్ణ యుగం లాంటి జగనన్న పాలనా కాలాన్ని గుర్తు చేసుకుంటూ... జగనన్న పాలనకు.. కూటమి ప్రభుత్వ పాలనకు బేరీజు వేసుకుంటున్నారన్నారు. మళ్లీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురుచూసే పరిస్థితి వచ్చిందన్నారు. ఈసారి కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని.. కూటమి ప్రభుత్వం చేస్తున్న దగాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా అశేషంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.