logo

ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలపై సంక్రాంతి మరియు ఎన్నికల కోడ్ కొర్రిపట్టే ఆలోచనలో కాంగ్రెస్

.


రైతులకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా... క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని, సగానికి పైగా రైతులకు ఇప్పటికీ మాఫీ కావాల్సి ఉందని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రస్థాయిలో ఖండించారు. రైతులకు అమలవుతున్న ప్రభుత్వ పథకాలపై బీ.ఆర్.ఎస్ నేతలు గ్రామాల్లో సమగ్ర సర్వే జరుపుతున్నారని ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. ఇప్పటికే పలు గ్రామాల్లో సర్వే జరిగిందని, రుణమాఫీ విషయంలో రైతులు తీవ్ర అన్యాయానికి గురైనట్లు సర్వే స్పష్టం చేస్తోందని ఉదాహరణలతో సహా వివరించారు. తన స్వగ్రామమైన దీపాయి గూడలోనూ దాదాపు నాలుగు వందల మంది రైతులకు రుణమాఫీ కాలేదని తెలిపారు. అతి త్వరలోనే సర్వే పూర్తి చేసి నివేదికను కలెక్టర్ కు అందిస్తామని పేర్కొన్నారు. రెండు విడతల రైతు భరోసా ఎగ్గొట్టిన రాష్ట్ర ప్రభుత్వం... స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంక్రాంతి సమయానికి రైతు భరోసా వేస్తామని మరోసారి బూటకపు హామీలు ఇస్తోందని మండిపడ్డారు. రైతు సంబరాల్లో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 4వ విడత కింద జిల్లాలోని 6600 మందికి రుణ మాఫీ చేస్తే ఒక్కరి ఖాతాల్లోనూ నగదు జమ కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిన లెక్కల ప్రకారమే మరో మరో 11 వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇకనైనా ఇంచార్జ్ మంత్రి తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రైతులకు జరుగుతున్న అన్య పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రేషన్ కార్డులు, రైతు బంధు, పెన్షన్లు, ఇందిర్మన్న ఇండ్లు ఇలా అన్ని పతకాలను సంక్రాంతికి ముడివేస్తూ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ను సాకుగా చూపేలా ప్రణాళికలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తి తో ఉన్నారన్న ఆయన.. వారే తగిన బుద్ధి చెప్తారని అన్నారు. సోయా కొనుగోల్లలోనూ ప్రతిష్టంభన నెలకొందని, జిల్లలో మరో 2లక్ష క్వింటాళ్ళ సోయా కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ కేంద్రాలను ఎత్తేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి పక్షాన నిలబడి ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు దశల వారిగా ఉద్యమాలు చేపడతామని, రైతులు అధైర్యపడవద్దని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో,గండ్రత్ రమేష్,సాజితుద్దీన్,రాజన్న,సేవ్వా జగదీష్, కుమ్రా రాజు, పరమేశ్వర్, ఆప్కమ్ గంగయ్య,బట్టు సతీష్,ఉగ్గే విట్టల్,దయాకర్ తదితరులు పాల్గొన్నారు,

0
0 views