జిల్లా సాగునీటి ప్రాజెక్టు సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం
*జిల్లా సాగునీటి ప్రాజెక్టు సంఘాల ఎన్నికలు ఏకగ్రీవం
*వంశధార ప్రాజెక్టు చైర్మన్గా అరవల, నారాయణపురం ప్రాజెక్ట్ చైర్మన్గా సనపల
*ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ లను అభినందించిన శాసనసభ్యులు గొండు శంకర్
శ్రీకాకుళం, డిసెంబర్ 21: శ్రీకాకుళం జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సంఘాల ఎన్నికలు ఏకగ్రీవంగా ప్రశాంతంగా జరిగాయి. శనివారం ఉదయం స్థానిక ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయంలో వంశధార ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజనీరు ఎన్నికలను పర్యవేక్షించారు., డీసీ (డిస్ట్రిబ్యూటరీ కమిటీలు) లు నీటి ప్రాజెక్టుల సంఘాలకు చైర్మన్, వైస్ చైర్మన్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.బి ఆర్ ఆర్ వంశధార ప్రాజెక్టుకు చైర్మన్గా నైరా వాస్తవ్యులు అరవల రవీంద్రబాబు, వైస్ చైర్మన్ గా ఎల్లన్నపేట మండలం వాస్తవ్యులు ఆనందరావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టి పి ఆర్ నారాయణపురం ఆనకట్ట ప్రాజెక్టు సిస్టంకు చైర్మన్గా సనపల డిల్లేశ్వరరావు, వైస్ చైర్మన్ గా పొన్నాడకు చెందిన పంచిరెడ్డి కృష్ణారావు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్ లను అభినందించి, రైతులకు సకాలంలో నీరు అందించేందుకు కమిటీలు కృషి చేయాలని కాలువలు ఆధునికరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, దానికి తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమీ నాయకులు, మాజీ పిఎసిఎస్ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, టిడిపి జిల్లా అధ్యక్షులు కలమట వెంకటరమణమూర్తి, జనసేన జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, భాజపా జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, పలువురు నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, రైతులు, స్థానిక కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.