logo

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను ప్రతిభ చాటాలి* --- *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల*

తెలంగాణ స్టేట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
డిసెంబర్ 20


*విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోను ప్రతిభ చాటాలి*
--- *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల*

విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసిస్తూనే, క్రీడల్లోనూ ప్రతిభ చాటి, జాతీయస్థాయి గుర్తింపు పొందాలని *రాష్ట్ర మార్కెఫెడ్ డైరెక్టర్, DCMS చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న *CM కప్ క్రీడల్లో* భాగంగా శుక్రవారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధి *శ్రీనివాస కాలనీలోని క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు* నిర్వహించారు. *KTPS విద్యుత్ కళాభారతి లో ఫుట్ బాల్ పోటీలు* నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో ముఖ్యఅతిధిగా పాల్గొన్న *కొత్వాల* మాట్లాడుతూ క్రీడల వలన శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని అన్నారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి *భద్రాద్రి కొత్తగూడెం* జిల్లా *పేరును జాతీయస్థాయిలో* నిలపాలని *కొత్వాల* అన్నారు.

*అథ్లెటిక్స్ లో నేషనల్ లెవెల్ లో రెండవ స్థానం పొందిన శ్రీతేజ ను అభినందించిన కొత్వాల, క్రీడాసంఘాలు, అధికారులు*
ఇటీవల భువనేశ్వర్ లో జరిగిన నేషనల్ అథ్లెటిక్స్ లో రెండవ స్థానం పొందిన, జిల్లాకు చెందిన *T శ్రీతేజ ను కొత్వాల తోపాటు పలువురు అభినందించారు*. T శ్రీతేజ కు పథకం ఇచ్చి, శాలువాతో సత్కరించారు.

ఈ కార్యక్రమాల్లో *DYSO పరంధామరెడ్డి, సింగరేణి జనరల్ మేనేజర్ (ఎడ్యుకేషన్) G శ్రీనివాస్, మున్సిపల్ కమీషనర్ K సుజాత, ఫరీద్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు Dr G యుగంధర్ రెడ్డి, ఉపాధ్యక్షులు Y వెంకటేశ్వర్లు, చైర్మన్ K మహిధర్, కార్యదర్శి R రాజేంద్రప్రసాద్, జిల్లా షటిల్ బాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీదేవి, గిరిజన నాయకులు ఆరెం ప్రశాంత్, కోచ్ నాగేందర్, ఫుట్ బాల్ కోచ్ ప్రేమ్ కుమార్, కచ్చా నరేష్, అరుణ్ కుమార్*, తదితరులు పాల్గొన్నారు.

49
2870 views