
**భారతజాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ **
భారతరత్న ఇవ్వకుండా అంబేద్కర్ గారిని అవమానించిన కాంగ్రెస్ పార్టీ యావత్ భారతజాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్
ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని కేంద్ర మంత్రివర్యులు అమిషా గారు అవమానించారని వక్రీకరిస్తున్న కాంగ్రెస్ పార్టీని బర్తరఫ్ చేయాలని మాజీ బిజెపి ఎస్సీ మోర్చా స్టేట్ మీడియా కన్వీనర్ మేకల ఆంజనేయులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ ఎస్సీ కాలనీలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం మేకల ఆంజనేయులు మాట్లాడుతూ అంబేద్కర్ గారిని బిజెపి ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పంచతీర్థ పేరుతో అంబేద్కర్ గారు పుట్టిన, చదువుకున్న, ఆయన ఇంటిని మరియు ఆయన మరణించిన ప్రదేశాలను అభివృద్ధి చేశారని,కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని అడుగడుగునా అవమానాలకు గురి చేసిందని ముఖ్యంగా 1952లో బాంబే నుంచి పోటీ చేస్తే ఓడించిందని అదేవిధంగా 1954లో బాంద్రా నుంచి పోటీ చేస్తే అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారిని ఉద్దేశ్య పూర్వకంగా ఓడించడం జరిగిందని తెలిపారు.1971 లో ఇందిరాగాంధీ గారికి భారతరత్న ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి మీద ఇంత ప్రేమ ఉలకపోస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయనకు భారతరత్న ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని చివరికి ఆయన మరణానంతరం 1991లో విపి సింగ్ ప్రభుత్వం అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వడం జరిగిందని చివరకు ఆయన చనిపోతే ఖననం చేయడానికి ఢిల్లీలో అనుమతిని కాంగ్రెస్ పార్టీ యావత్ భారతజాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ సీనియర్ నాయకులు కారపాకుల రాజ శేఖర్,మేకల ఓబన్న,భాస్కర్ సుధాకర్, చెవిటీ బాలస్వామి, ఏలీయా,మేరీ, జ్యోతి మరియు లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు