Breaking News:
Criminal Appeal case dismissed in 9th Addl District Court, Machilipatnam, Krishna District. Andhra Pradesh, India.
పెద్దయాదార హత్యయత్నం కేసు కొట్టివేత…కృష్ణా జిల్లా 9 వ అదనపు జిల్లా జడ్జి తీర్పు….
మచిలీపట్నం మండలం పెద్దయాదార సొసైటీ మాజీ అధ్యక్షుడు మరియు అతని కొడుకు పై జరిగిన హత్యయత్నం కేసు లో ఎనిమిది మంది నిందితుల పై కేసు కొట్టివేస్తూ క్రింది కోర్టు తీర్పు ని నిర్దారిస్తూ కృష్ణా జిల్లా 9 వ అదనపు జిల్లా జడ్జి ఎస్. సుజాత సోమవారం తీర్పు చెప్పారు…నిందితులు తరుపున కేసు గెలిచిన న్యాయవాదులు లంకిశెట్టి బాలాజీ కమ్మిలి విజయకుమార్ తెలిపిన వివరాలు ప్రకారం పెద్దయాదార సొసైటీ మాజీ అధ్యక్షుడు గ్రామ మాజీ సర్పంచ్ భర్త కంచర్లపల్లి పిచ్చియ్య (67) మరియు అతని కుమారుడు కంచర్లపల్లి ధన్వంతరి (30) ల పై పాత కక్షలు పురస్కరించుకుని అదే గ్రామానికి చెందిన నిందితులు కంచర్లపల్లి బాలనాగేశ్వరరావు (57)కంచర్లపల్లి వెంకటేశ్వరరావు (30)కంచర్లపల్లి హరిబాబు (31) కోసూరి లక్ష్మి నాంచారయ్య (75)శ్రీపతి శ్రీనివాసరావు (42) అర్జా బాలాజీ (31)ఆర్జా మారుతి (27)బొమ్మసాని శ్రీనివాసరావు (33) రెబ్బ వెంకటేశ్వరరావు (38) కలసి మారణాయుధాలు తో దాడి చేశారని బందరు తాలుకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు…నిందితులు తాము నేరం చేయలేదు అని అప్పటి రాజకీయనాయుకుల వత్తిడి తో తమ పై అక్రమ కేసు నమోదు చేసినట్లు వాదన పెట్టినారు..కేసు సుదీర్ఘ విచారణలో నిందితులు పై నమోదు చేసిన కేసులో ప్రాసిక్యూషన్ విఫలం కావడం తో కేసు కొట్టివేస్తూ2022 సెప్టెంబర్ 22 న మచిలీపట్నం అదనపు సహాయ సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు.. క్రింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కంచర్లపల్లి పిచ్చయ్య, ధన్వంతరి జిల్లా కోర్ట్ లో అప్పీల్ చేసినారు..9 వ అదనపు జిల్లా జడ్జి ఎస్ సుజాత ఇరు వర్గాల వాద ప్రతివాదనలు విన్న తర్వాత నిందితులు పై కేసు కొట్టివేస్తూ తీర్పు చెప్పారు..ఈ కేసు తీర్పు కోసం పెద్దయాదరా కి చెందిన అనేక మంది గ్రామస్థులు కోర్టుకి వచ్చారు..కోర్ట్ తీర్పు పై హర్షం వ్యక్తంచేశారు