హిందువుల ఐక్యతను చాటాలి
అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలు తక్షణమే ఆగాలని, ఇస్కాన్ ప్రతినిధి చిన్మయి కృష్ణ దాస్‌ను అన్యాయమైన జైలు శిక్ష నుండి విముక్తి చేయాలనీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు అన్నారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందు ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సంఘీభావ సభ నిర్వహించారు.
ఎమ్మెల్యేతో పాటు మాటదిపతి శ్రీ యోగానంద సరస్వతి, పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ... బంగ్లాదేశ్ లో జరుగుతున్న అమానవీయ హింసలు ఆందోళనకరమని అన్నారు. దాడి ఘటనలను ఆపేందుకు అక్కడి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని, బంగ్లా ప్రభుత్వ నిస్సహాయత కారణంగా హిందువులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గోపాలకృష్ణ పీఠాధిపతి హిందూ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు