logo

మహిళలపై హింసకు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలి వెల్గొండ పద్మ

జగిత్యాల పట్టణ కేంద్రం లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆధ్వర్యంలో మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఐద్వ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా చట్టాలు, హింస, వివక్ష, దాడులు, లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులు, బాల్య వివాహాల గురించి పిల్లలకు అవగాహన కల్పించరు వివిధ రూపాల్లో మహిళలు అనేక రకాల హింసలకు గురవుతున్నారు మహిళల్లో భయం పోవాలి ధైర్యంగా ముందుకు వస్తే ఐద్వ మహిళా సంఘం ఎప్పుడు మహిళలకు అండగా ఉంటుందని హింసను ఎదుర్కొనే దిశగా తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదని తెలియచేసారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ కళాశాల బృందన్ని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐద్య జిల్లా ప్రధాన కార్యదర్శి వెల్గొండ పద్మ మాట్లాడుతూ మహిళగా సామాజిక బాధ్యతను తన భుజస్కందాలపై వేసుకుని ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ మహిళల కోసం నిరంతరం శ్రమిస్తున్నానన్నారు NSS ప్రోగామ్ ఆఫీసర్ స్టాప్ సెక్రటరీ సంగీత వివిధ చట్టాల పై అవగాహనా కల్పించి పలు జాగ్రత్తలు తీసుకోవాలని చక్కగా వివరించారు కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణ సమాజంలో మహిళ లు ఎలా ఉంటే హింసను ఎదుర్కొనవచ్చు అని ప్రతి మహిళ చైతన్యం కలిగి ఉన్నప్పుడే సమాజం లో హింస ను వివక్షత ను దాడులను ఎదుర్కొనవచ్చునని సూచించారు

4
443 views