logo

మందుబాబులకు .. సర్కార్ కిక్కు ....5 లక్షల జరిమానా

మద్యం విక్రయాల విషయంలో కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా మార్పులు చేస్తూ ముందుకు కదులుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు MRP ధరల కన్నా మద్యం షాపుల్లో ఒక్క రూపాయి ఎక్కువ అమ్మిన షాపు లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా 5 లక్షల రూపాయల జరిమానా కూడా విధించనున్నట్లు తెలుపుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే మద్యం దుకాణాల పరిధిలో ఎక్కడ బెల్టు షాపులు కనిపించిన 5 లక్షల జరిమానా విధిస్తామని తెలిపింది. ఇక నచ్చిన మందు MRP ధరలకే అమ్మే విధానాన్ని తీసుకుని వచ్చి సిండికేట్ దందా బారిన పడకుండా చేసినందుకు మందు బాబులు కొత్త కూటమి సర్కారు పట్ల హర్షం వ్యక్తం చేశారు

1
42 views