కుక్కలు బాబోయ్ .. లక్షల కుక్కలు
జంతువులని ప్రేమించండి .. జంతువులను రక్షించండి ఇలాంటివి చెప్పుకోవడానికి బాగానే ఉంటాయ్ కానీ ఏదైనా అతిగా ఉంటే అనర్ధాలే ఏర్పడతాయి అంటున్నారు వీధుల్లో కుక్కల స్వైర విహారం వల్ల ఇబ్బందులు పడుతున్న బాధితులు. పశ్చిమగోదావరి జిల్లాలోని గ్రామ గ్రామాన వీధి వీధినా లక్షల సంఖ్యలో కుక్కల బెడద చాలా ఎక్కువగా ఉండటం వల్ల ద్విచక్ర వాహన దారులు, మరీ ముఖ్యంగా పిల్లలు తీవ్రంగా గాయపడడం కొన్ని సందర్బాలలో ప్రాణాలనే కోల్పోవడం జరుగుతోంది. వీటి మీద ఎన్నో వార్తా కథనాలు ప్రచురితమైన జంతు ప్రేమికుల మూర్ఖత్వం వల్ల ప్రాణాలు పోతున్నాయ్ కనీసం ఇప్పటి వరకు అలాంటి సంస్థల నుండి ఒక్కరికీ కూడా ఒక్క రూపాయి నష్ట పరిహారం ఇప్పించలేకపోయారు. ఈ విషయంలో సంబంధిత అధికారులు స్పందించి సరైన చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబాలు, సామాన్యులు కోరుకుంటున్నారు.