logo

పోటు ప్రసాద్ మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటు సంతాపసభలో సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

కొత్తగూడెం : ఎన్నో ప్రజా, కార్మిక, రైతు, విద్యార్థి, యువజన ఉద్యమాలకు నాయకత్వం వహించి ప్రజానాయకుడిగా మరింత ఎదుగుతున్న తరుణంలో పోటు ప్రసాద్ మృతి చెందడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందని, మూడు దశాబ్ధాలపాటు క్రియాశీలక రాజాకీయాల్లో కలిసి పనిచేసి ఆకస్మికంగా మృతిచెందిన పోటు ప్రసాద్ ఉద్యమ స్మృతుల్ని మిగిల్చారని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. గుండెపోటుతో మృతి చెందిన ఖమ్మం జిల్లా సిపిఐ కార్యదర్శి పోటు ప్రసాద్ అంతిమ యాత్ర ప్రారంభానికి ముందు సిపిఐ ఖమ్మం జిల్లా కార్యాలయం 'గిరిప్రసాద్' భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన సంతాపసభలో అయన మాట్లాడారు. పార్టీ, ప్రజాసంఘాల బలోపేతంకోసం అనునిత్యం పరితపించేవాడని, పార్టీని నమ్ముకునే ప్రజాసేవకు అంకితమైన కార్యకర్తలకు ప్రసాద్ భరోసా అని, ప్రతి కార్యకర్త నాయకుడిగా ఎదగాలని ఆకాంక్షించే గొప్ప నాయకుడు ప్రసాద్ అని కొనియాడారు. అనంతరం జరిగిన అంతిమ యాత్రలో పాడే మోసి ప్రసాదుతో ఉన్న అనుబంధాన్ని చాటారు. అయన లేని లోటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ఉద్యమాలకు తీరని లోటని, అయన ఆశయాలకు పునరంకితం కావాలని పార్టీ శ్రేణులను కోరారు.

0
1723 views