logo

నంద్యాల జిల్లా (వెలుగోడు : ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి గ్రామీణ విత్తనోత్పత్తి పథకం: ఏఓ పవన్ కుమార్.. డిఆర్ సి ఏఓ హేమలత...

నంద్యాల జిల్లా (వెలుగోడు):
వెలుగోడు మండలం బోయరేవుల గ్రామంలో ఏవో పవన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో గ్రామ విత్తన ఉత్పత్తి పథకం గురించి నంద్యాల డిఆర్సి ఏవో హేమలత వివరించారు. వారు మాట్లాడుతూ రైతులు తామే స్వయంగా విత్తనాలను ఉత్పత్తి చేసుకోవాలని, గ్రామానికి కావలసిన విత్తనం గ్రామ స్థాయిలోనే తయారు చేసుకోవాలని ఆమె తెలిపారు.
ఏవో పవన్ కుమార్ మాట్లాడుతూ వెలుగోడు మండలంలోని బొయిరేవుల వేల్పనూరు వెలుగోడు గ్రామాల్లో ఖరీఫ్ 2024న వరి పంట సీడ్ విలేజ్ ప్రోగ్రాం గ్రామ విత్తన ఉత్పత్తి పథకం అమలు చేస్తున్నామని, క్షేత్ర స్థాయిలో ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం. సబ్సిడీపై విత్తనాన్ని సరఫరా చేసి సగటు రైతులు వ్యవసాయంలో అత్యంత కీలకమైన విత్తనం మంచి ఉత్పత్తి మరియు ఉత్పాదకతలో కావాల్సిన పెరుగుదలను సాధించడంలో సహాయపడుతుంది. రాయితీపై విత్తనాన్ని సరఫరా చేస్తున్నప్పుడు ప్రధాన లక్ష్యం వైవిధ్యభరితమైన ప్రత్యామ్నాయం మరియు వ్యవసాయ సమాజానికి నాణ్యమైన విత్తనాన్ని అందుబాటులో ఉంచడం అని ఏవో తెలిపారు.
అనంతరం గ్రామీణ ఉత్పత్తి పథకం గురించి, వరి నారు యాజమాన్యం మరియు పంట కాలంలో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యల గురించి, పంట అనంతరం పంట నిలువలు గురించి రైతులకు అవగాహన కల్పించారు.
విత్తనోత్పత్తిలో ప్రధాన అంశం పంటలో కేళీలను తీయుట, వెన్ను లక్షణాలు, గింజ రంగు, ఆకారం, పరిమాణం మొదలగు లక్షణాల్లో తేడా ఉన్న మొక్కలను సమూలంగా తీసివేయాలని ఏవో హేమలత తెలిపారు.
అనంతరం వరి కోత కోసినప్పుడు నూర్పిడి సమయాల్లో యాంత్రిక కల్తీ అనగా యంత్రాల ద్వారాగాని, మనుషుల ద్వారా పనిముట్ల ద్వారా గాని, ఇతర రకాల గింజలు కలువ కుండా జాగ్రత్త వహించాలి. నూర్పీడి యంత్రాల ద్వారా విత్తన విత్తన కల్తీ జరుగుతుంది. కావున ఎలాంటి పరిస్థితుల్లోను విత్తనోత్పత్తి చేలలో యంత్రాలను వాడరాదు.
విత్తనాన్ని ఎండబెట్టేటప్పుడు తేమ శాతం 13 శాతాని కి చేరుకునేవరకు బాగా ఎండలో ఎండబెట్టాలి. కల్లాల్లో యాంత్రిక కల్తీ లేకుండా చూడాలి.
విత్తన నిల్వకు బాగా శుభ్రం చేసిన గోనె సంచులను లేదా కొత్త సంచులను మాత్రమే ఉపయోగించాలి. అలాగే నిల్వ చేసేటప్పుడు అధిక తేమ శాతం, అధిక ఉష్ణోగ్రతకు గురికాని గాలి, వెలుతురు బాగా తగిలే ప్రదేశాల్లో నిల్వ చేయాలి.
విత్తనాన్ని గాదెల్లో గాని, పాతరల్లోగాని లేదా ఎరువుల సంచుల్లోగాని నిల్వ ఉంచరాదు. విత్తనాన్ని నిల్వ ఉంచిన చోట ఎరువులను గాని, పురుగు మందులను గాని ఉంచకూడదు.
విత్తనోత్పత్తి గ్రామస్థాయిలో లేదా ఒక రైతు సహకార సంస్థ స్థాయిలో చేసేటప్పుడు, ఒక ప్రాంత రైతులందరూ తమకు కావల్సిన విత్తనాన్ని ముఖ్యంగా ఒకే రకానికి చెందినదై ఉండే విత్తనాన్ని ఉత్పత్తి చేయడం మంచిది.
ఈ విధంగా మెళకువలు పాటిస్తే పైన వివరించిన లక్షణాలు గల నాణ్యమైన విత్తనాన్ని రైతులు తమ తమ పొలాల్లో తామే స్వయంగా తయారుచేసుకొని, విత్తనాలు ఖర్చు తగ్గించుకోవడమే కాక, కల్తీ విత్తనాల బారిన పడకుండా తమను తాము రక్షించుకొని, అధిక దిగుబడులను సాధించవచ్చని ఏవో పవన్ కుమార్ తెలిపారు.
గ్రామ సభ అనంతరం క్షేత్రస్థాయిలో గ్రామీణ విత్తన ఉత్పత్తి క్షేత్రాలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పవన్ కుమార్, డిఆర్సి ఎఓ హేమలత, ఏఈఓ సుధారాణి, వ్యవసాయ విస్తరణ సిబ్బంది అర్ఫత్ పలువురు రైతులు పాల్గొన్నారు.

1
2694 views