logo

రాష్ట్రం బాగుండాలని కూటమి ప్రభుత్వానికి మైనార్టీలు మద్దతు ఇచ్చారు.: రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ గారు

నంద్యాల జిల్లా :
నంద్యాల పట్టణంలో 5 వ వార్డ్ నడిగడ్డ ఫాతిమా మజీదు కమిటీ సభ్యులు మరియు వార్డు ప్రజలు మరియు నందమూరి నగర్ వార్డు ప్రజలు ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ ని దృశ్యాలువతో సన్మానించి గజమాల వేసి ఘన స్వాగతం పలికారు .ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా ముస్తాక్ అహ్మద్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీ సోదరులు ఎంతో వివక్షకు గురి అయి ముస్లిం మైనార్టీ సోదరులకు రావలసిన పథకాలు అందక సామాజికంగా ఆర్థికంగా వెనకబడి పోవడం జరిగింది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం మైనా ర్టీ సోదరులకు ఒక స్వర్ణ యుగంలా ఉండేది. ముస్లిం మైనార్టీల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎన్నో సంక్షేమ పథకాలు, ఆడపిల్లల
వివాహాలకు దుల్హన్ 50 వేలు, దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇమాం మౌజనులకు జీతాలు, షాది ఖానాలు, ఈద్దాలు, మదర్సాల నిర్మాణం ఎన్నో పథకాలు అందేవి, మాయమాటలతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేశారు. అది తెలుసు కున్న ముస్లిం మైనార్టీ సోదరులు 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పక్షాన నిలబడి చంద్రబాబు ని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 150 రోజుల్లోనే ఎన్నో సంక్షేమ కార్యక్ర మాలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబునాయుడు, ముస్లిం మైనార్టీల కూడా అండగా ఉంటామని భరోసానివ్వటం మా అదృష్టంగా భావిస్తూ నన్ను రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నుకున్నందుకు ఆయన కు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రం బాగు పడాలన్నా ,అభివృద్ధి జరగాలన్న విజన్ లీడర్ చంద్రబాబు తోనే సాధ్యం అని ప్రజలందరూ నిరూపించారని అన్నారు.రాష్ట్ర భవిష్యత్తు,ప్రజలకోసం ప్రాణాలకు తెగించి పోరాటాలు చేశానని అన్నారు.రాష్ట్రంలో వైసిపి పాలనలో మైనారిటీలపై ఎక్కడ దాడులు జరిగినా వారికి మద్దతుగా నిలచానని అన్నారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఖాజా ఫరీద్, అబ్దుల్ రషీద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఖాజా హాఫిజ్, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

13
1963 views