Breaking News: Andhra Pradesh, India.
ఎర్రచందనం స్మగ్లర్ల బీఎండబ్ల్యూ కార్లు ఏమైనాట్లు.. పవన్ కళ్యాణ్
కొద్ది కాలం క్రితం ఎర్ర చందనం స్మగ్లర్ల నుంచి అటవీ శాఖ అధికారులు రెండు బీఎండబ్ల్యూ కార్లు స్వాధీనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ అధికారులు.వాటిల్లో ఒకటి అటవీ శాఖ అధికారికి కేటాయించారు. రెండో కారు ఒక ఐఏఎస్ సతీమణి వాడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో, రెండు బీఎండబ్ల్యూ కార్ల అంశం పైన డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీసారు. పూర్తి నివేదిక ఇవ్వాలని కోరారు. దీంతో, అధికారుల్లో టెన్షన్ మొదలైంది.
స్మగ్లర్ల నుంచి స్వాధీనం
ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న ఖరీదైన బీఎండబ్ల్యూ కారుల వ్యవహారం ఇప్పుడు అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 2017 లో స్వాధీనం చేసుకున్న ఈ కార్లు మాయం అయ్యాయి దీనికి సంబంధించి పవన్ ఆరా తీసారు. అధికారులు ఇచ్చిన ప్రాధమిక సమాచారం మేరకు ఈ రెండు కార్లలో ఒకటి అప్పట్లోనే అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా పని చేసిన అనంతరాముకు కేటాయించారు. ఆ తరువాత నీరబ్ కుమార్ ప్రసాద్ ఆ స్థానంలోకి వచ్చారు. అయితే, ప్రస్తుతం ఆ కారు ఏమైందో.. ఎక్కడ ఉందో తెలియదంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో, ఆ వాహనం వివరాలు ఇవ్వాలని తాజాగా పీసీసీఎఫ్ నుంచి అటవీ శాఖ ప్రధాన కార్యదర్శికి లేఖ అందింది
రెండు కార్లు మాయం
ప్రభుత్వ వర్గాల్లో ఈ చర్చ కొనసాగుతున్న సమయంలో ఆ బీఎండబ్ల్యూ కారును కీలక స్థానంలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి భార్య హైదరాబాద్‌లో వినియోగిస్తున్నట్లు అటవీశాఖ ఉద్యోగుల్లో ఆసక్తి కర చర్చ జరుగుతోంది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలో నమోదైన కేసులో ఓ ఎర్రచందనం స్మగ్లర్ నుంచి టీఎన్ 05 బీహెచ్ 3303 నంబరు బీఎండబ్ల్యూ కారును అటవీ అధికారులు సీజ్ చేశారు. ప్రభుత్వ స్వాధీనం (కాన్ఫిస్‌కేట్) కాకముందే ఆ వాహనాన్ని 2017 డిసెంబరు 11వ తేదీన అటవీశాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయించారు. ఆ స్థానంలో ఉన్న అనంతరాము తర్వాత నీరబ్‌కుమార్ ప్రసాద్, ఆదిత్యనాథ్ దాస్, పదవీ విరమణ చేసిన మరో అధికారి జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ కూడా ఈ పోస్టుల్లో కొనసాగారు.
పవన్ ఆరా తో
కానీ, ఇప్పుడు ఆ బీఎండబ్ల్యూ కారు ఎక్కడుందనేది అధికారికంగా అటవీశాఖకు సమాచారం లేకపోవటం ఆశర్చకరంగా మారింది. అదే విధంగా పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న టీఎన్ 18కే 2277 బీఎండబ్ల్యూ బ్లూ కలర్ వాహనాన్ని 2015 ఫిబ్రవరిలో అప్పటి అటవీశాఖ మంత్రి అదనపు ప్రైవేటు కార్యదర్శికి కేటాయించారు. ఆ కారు గురించి కూడా ప్రస్తుతం అటవీ అధికారులకు అధికారిక సమాచారం లేదు. వీటితో పాటుగా టయోటా కారు సమాచారం కూడా అందుబాటులో లేదని తెలుస్తోంది. వీటి వినియోగం.. అసలు ఆ కార్లు ఏమయ్యాయనేది ముఖ్య అధికారులకు అంతు చిక్కటం లేదు. దీంతో, ఇప్పుడు పవన్ కల్యాణ్ జోక్యంతో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.