logo

Fake Journalist are not leaving RTC Busses also in Andhra Pradesh, India.

*ఆర్టీసీనీ వదలని నకిలీ జర్నలిస్టులు.. విలేకరి బస్‌ పాస్‌ ఫోర్జరీ*

జర్నలిస్టుల ముసుగులో నకిలీలు చెలరేగిపోతున్నారు. ఇప్పటి వరకు పీడీఎస్‌ బియ్యం లారీలను ఆపి దౌర్జన్యంగా సొమ్ములు వసూలు చేసుకుంటూ పోలీసులకు పట్టుబడిన నకిలీలను చూశాం.

నకిలీలు మీడియా మీటింగ్ లో ముందు వరసలో కూర్చుంటారు కొందరు.
జర్నలిస్టుల ముసుగులో నకిలీలు చెలరేగిపోతున్నారు. ఇప్పటి వరకు పీడీఎస్‌ బియ్యం లారీలను ఆపి దౌర్జన్యంగా సొమ్ములు వసూలు చేసుకుంటూ పోలీసులకు పట్టుబడిన నకిలీలను చూశాం. తాజాగా ఏకంగా ఆర్టీసీనే బోల్తా కొట్టించే యత్నం చేస్తున్న నకిలీల లీలలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత కొంతకాలంగా జర్నలిస్టుల పేరుతో చెలామణి అవుతూ కొందరు వ్యక్తులు అధికారులు, ప్రజాప్రతినిధులను, చిరు వ్యాపారులను టార్గెట్‌ చేస్తూ వచ్చారు. కాలక్రమంలో కొందరిపై పోలీసులు నిఘా ఉంచి అరెస్ట్‌ చేసిన ఘటనలూ జరిగాయి. బెల్టు షాపుల్లో వ్యాపారులను భయపెట్టి తప్పతాగడంతో పాటు అధికారులను, అంగన్వాడీ టీచర్లను , సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని సిబ్బందిని వేధిస్తూ వచ్చారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటనలో షేక్ మదీనా బాషా అనే వ్యక్తి బస్సు ఎక్కి, జర్నలిస్టు పాస్‌ను కండక్టర్‌కు చూపించాడు. అదే సమయంలో ఆర్టీసీ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీ చేస్తుండగా అతని పాస్‌ నకిలీదని తేలింది. ఇది కొయ్యలగూడెం - దొండపూడి బస్సులో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ ఉదంతం వెలుగులోకి రావడంతో జర్నలిస్టు సంఘాలు స్పందించాయి. నకిలీలు ఇటీవలి కాలంగా చెలరేగిపోతున్నారని, అసలు జర్నలిస్టుల మనుగడకు ఈ నకిలీలతో ప్రమాదం ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశాయి. ఎవరైనా జర్నలిస్టుల పేరిట బెదిరింపులకు, మోసాలకు దిగినా అప్రమత్తంగా ఉండాలని సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు.

1
0 views