logo

Visakhapatnam City, Andhra Pradesh, India.

*Visakhapatnam Auto Driver Fined Rs 10 Thousand by Visakhapatnam City Police Officers*

విశాఖ: ఆటో డ్రైవర్‌కు రూ.10వేలు జరిమానా.. అమ్మో పోలీసులే అవాక్కు, కారణం ఏంటో తెలుసా!

విశాఖపట్నంలో పోలీసులు తరచుగా వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో వన్‌టౌన్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేశారు.. అయితే ఓ ఆటో అటు వైపుగా రాగా ఆపారు. అయితే ఆటో డ్రైవర్ దెబ్బకు పోలీసులే అవాక్కయ్యారు. ఆ ఆటోలో మనోడు ఏకంగా 20మంది స్కూల్ విద్యార్థులు ఉండటాన్ని చూసి అవాక్కయ్యారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు జరిమానా విధించారు.

విశాఖపట్నంలో ఆటో డ్రైవర్‌కు పోలీసులు భారీ జరిమానా విధించారు. డ్రైవర్ నిబంధనలకు విరుద్ధంగా, పరిమితికి మించి ఆటోలో స్కూల్ విద్యార్థులను తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు జరిమానా విధించినట్లు వన్‌టౌన్‌ ట్రాఫిక్‌ సీఐ చెప్పారు. వన్‌టౌన్ ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.. ఆ సమయంలో పూర్ణమార్కెట్ నుంచి జగదాంబకూడలికి వెళ్తున్న ఆటోను ఆపారు.. అందులో ఏకంగా 20 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు. ఆటోలో ఏకంగా 20మందిని చూసి పోలీసులు సైతం అవాక్కయ్యారు.. అంతమందిని ఎలా ఎక్కించావురా బాబూ అంటూ ప్రశ్నించారు. ఆ డ్రైవర్‌కు రూ.10వేల జరిమానా విధించారు. విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు, స్కూళ్ల యాజమాన్యాలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సీఐ కోరారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి స్కూల్ విద్యార్థుల్ని, ప్రయాణికుల్ని ఎక్కించుకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు ఇకపై వాహనాల తీనిఖీలను ముమ్మరం చేస్తామని.. ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు.

1
6583 views