ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు పై గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు నీరసన..?
పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, ప్రతినిధి, కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం లో నామినేటెడ్ పదవులను ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంత్రావు తనకు నచ్చిన వారికి డబ్బులు ఇచ్చిన వారికే పదవులను కట్టబెడుతూ నిజమైన కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేస్తున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు కాంగ్రెస్ నాయకులపై ఎన్నో భయభ్రాంతులకు గురిచేసిన పార్టీ జెండా పట్టుకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన తోట లక్ష్మి కాంత్రాలను భారీ మెజార్టీతో గెలిపిస్తే గెలిచిన తర్వాత పార్టీ కార్యకర్తలను నాయకులను పట్టించుకోకపోగా గత ఎన్నికల్లో తనకు వ్యతిరేకం చేసిన వారికి ప్రస్తుతం పదవులను కట్టబెడుతూ నిజమైన నాయకులకు అన్యాయం చేస్తున్నారన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపికలో నాయకులు కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోకుండానే చైర్మన్ లను ఎంపిక చేశారని వారు ఆరోపించారు. మరియు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యే తీరు ప్రభావం చూపుతుందన్నారు. పదవులను అమ్ముకున్నారని తమ వద్ద ఉన్న పూర్తి ఆధారాలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు సౌదాగర్ అరవింద్, మాజీ జెడ్పిటిసిలు కమల్ కిషోర్, నాగనాథ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సంగమేశ్వర్ , మాజీ జడ్పిటిసి జయ ప్రదీప్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.