logo

కేంద్ర మంత్రి కి తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల ను రెగ్యులరైజ్ చేయుటకు సహకారం అందించాలని కోరిన TSSUS -TG, రేగొండ నాయకులు

✍🏽కేంద్ర మంత్రికి సమస్యలు పరిష్కారం చేయాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు వినతి

రేగొండ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానీయ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష (సర్వ శిక్ష అభియాన్) లో విధులు నిర్వహిస్తున్న ఒప్పంద ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించి, వారిని రెగ్యులర్ చేయాలని కోరుతూ ఆమెకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె సానుకూలంగా స్పందిస్తూ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు లక్ష్మణ్, నరేష్, మానస, స్వర్ణలత, రాజమౌళి, రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

5
1297 views