తెలంగాణ సంస్కృతి దేశం కి ఆదర్శం #తెలంగాణ MLC, కోదండరాం
✍🏽శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ ఎం. కోదండరాం.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శప్రాయమని శాసనమండలి సభ్యులు, తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం. కోదండరాం అన్నారు. శనివారం హైదరాబాదులోని బిర్లా సైన్స్ సెంటర్ లోని భాస్కర ఆడిటోరియంలో పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుడమి సాహితీ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చిలుముల బాల్ రెడ్డి అధ్యక్షతన పాన్ ఇండియన్ నేషనల్ అవార్డ్స్ కార్యక్రమం ఏర్పాటు అయింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కోదండరాం మాట్లాడుతూ తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలే కారణమన్నారు. కళలకు, కళాకారులకు పుట్టినిల్లుగా భాసిల్లే తెలంగాణ గడ్డపై పుట్టినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలని పిలుపునిచ్చారు.
_______________________
#prof_kodandaram #MLC #Telangana
#TelanganaJanaSamithi #TJS