నెల్లిమర్ల నగర పంచాయతీలో అవిశ్వాసంపై ఆసక్తికర చర్చ..!
స్థానిక సంస్థల అవిశ్వాసాలకు సంబంధించి రెండు
సంవత్సరాలకు కుదింపు చేస్తూ రాష్ట్ర కేబినెట్ కీలక
నిర్ణయం తీసుకోవడంతో నెల్లిమర్ల నగరపంచాయతీలో
చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికలలో 20
వార్డుల్లో YCP 13, TDP 7 వార్డులు కైవసం
చేసుకున్నాయి. వారిలో వైసీపీకి చెందిన చైర్పర్సన్,
ఇద్దరు కౌన్సిలర్లు జనసేనలో చేరారు. ఎక్స్ ఆఫిసియా
మెంబరుగా MLAకి ఓటు ఉండడంతో కూటమి బలం
పెరిగింది. దీంతో అవిశ్వాసంపై చర్చ మొదలైంది.