డోలా బాల వీరాంజనేయ స్వామికి వినతినిస్తున్న కే ధనలక్ష్మి .
డోలా బాల వీరాంజనేయ స్వామికి వినతినిస్తున్న కే ధనలక్ష్మి .
#AIMA MEDIA
Suvarnaganti RaghavaRao - Journalist--వార్డు వాలంటీర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర నాయకులు కే ధనలక్ష్మి, యూనియన్ బృందంతో కలసి ఏపీ సెక్రటేరియట్ లోని సాంఘిక సంక్షేమ, గ్రామ వార్డు సచివాలయ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి వారి చాంబర్ లో వినతి పత్రాన్ని అందించారు.
గత ప్రభుత్వం వాలంటీర్లకు ప్రశంసలు, అవార్డులు, రివార్డులే తప్ప కనీస వేతనాలు చెల్లించకుండా, పెంచుతామని భ్రమలలోనే వెట్టి చాకిరీ చేయించిందని, బలవంతంగా రాజీనామాలు చేయించిందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లకు రూ. 10వేల వేతనం చెల్లిస్తామని ఎన్నికలముందు ఇచ్చిన హామీని గుర్తు చేశారు.
డిగ్రీ చదివిన వారు కూడా వాలంటీర్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్నారని, కేవలం రూ.5వేల గౌరవ వేతనానికి ఐదేళ్లుగా పని చేయడానికి లక్షలాదిమంది సిద్ధపడ్డారంటే నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు. వరద ముంపుకు గురైన ప్రాంతాలలో వాలంటీర్స్ తో సేవలు చేయించుకొని వేతనాలు చెల్లించలేదన్నారు. వాలంటీర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి, కుటుంబాలను ఆదుకోవాలని, వ్యవస్థని కొనసాగించాలని, వేతనాలు చెల్లించాలని, రూ 10వేల వేతన హామీ నెరవేర్చాలని, జాబ్ ఛార్జ్ ప్రకటించాలని, బలవంతంగా రాజీనామాలు చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పలు సమస్యలపై విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రి స్పందిస్తూ మీ సమస్యలను పరిశీలిస్తామని తెలిపారన్నారు. ఈ బృందంలో గంధం దీప్తి, డి కొండబాబు, ఎం సింహాచలం లు ఉన్నారు.