logo

రైతులను ఇబ్బంది పెట్టకండి... రెవిన్యూ డివిజనల్ అధికారి రమాదేవి

మీడియా టుడే మెదక్ జిల్లా ప్రతినిధి బైండ్ల లక్ష్మణ్,21.11.2024:

రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా లారీల లో ఉన్న ధాన్యాన్ని తొందరగా దిగుమతి చేసుకోవాలని మెదక్ రెవిన్యూ డివిజనల్ అధికారి రమాదేవి మిల్లర్స్ యాజమాన్యాన్ని ఆదేశించారు.
బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా ఆర్డీవో రమాదేవి హవేలీ
ఘన్పూర్ మండలంలో విస్తృతంగా పర్యటించారు.
ముందుగా గాయత్రి రైస్ మిల్ ను పరిశీలించి ధాన్యం లారీలు దిగుమతులకు సంబంధించి ఎక్కువమంది హమాలీలను పెట్టుకుని ధాన్యం తొందరగా దిగుమతి చేసుకోవాలని రైతులు ఎంతో కాయ కష్టం చేసి వరి పండించి ప్రభుత్వం ద్వారా కొనుగోలు జరిగితే మద్దతు ధర వస్తుందని సదుద్దేశంతో
ఉంటారని మిల్లర్స్ యాజమాన్యం రైతులు ఎవరికీ అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు.
ధాన్యం దిగుమతులలో వేగం పెంచాలని సూచించారు.
అనంతరం కుచాన్పల్లి సమగ్ర ఇంటింటి సర్వేను పరిశీలించిఈ సందర్భంగా సమగ్ర కుటుంబ సర్వే ఫారములు క్షుణ్ణంగా నింపే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు
సమగ్ర కుటుంబ సర్వే ఫారములను తప్పు లేకుండా నమోదు చేయాలని అన్నారు.

4
542 views