logo

తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు...

జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.

మీడియా టుడే మెదక్ జిల్లా ప్రతినిధి బైండ్ల లక్ష్మణ్, 21.11.2024:

మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో మీడియా, మరియు సోషల్ మీడియాలో వస్తున్న చనిపోయిన వ్యక్తి పై FIR నమోదు అనే అంశం యొక్క వివరాలను వెల్లడిస్తూ .. నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో జరిగిన భూ వివాదం విషయంలో తేదీ:23.09.2024 నాడు ఫిర్యాదుదారుడు ఇమ్మడి శ్రీనివాస్ ఫిర్యాదుఇవ్వగా నలుగురు వ్యక్తులపై cr.no 242/2024 u/s 329(3),324(4),R/w 3(5) BNS of Narsapur గా FIR నమోదు చేయడం జరిగినది.
ఏదైనా ఫిర్యాదు వస్తే చట్ట ప్రకారం మొదటగా FIR నమోదు చేసిన తర్వాత ఆ కేసుకు సంబందించి పూర్తి విచారణ చేపట్టిన తర్వాత ఆ కేసుకు సంబందించి మా విచారణలో భాగంగా అట్టి సంఘటనతో సంబందం ఉన్న వారిని బాద్యులుగా చేసి మిగతా వారిని అనగా అట్టి సంఘటనతో సంబందం లేని వారిని కేసు నుండి తొలగించడం జరుగుతుంది. ఈ కేసులో కూడా అట్టి కేసుకు సంబందించి ఫిర్యాదులో ఉన్న వ్యక్తి పాత్లోత్ విఠల్ కేసు కాక ముందే మరణించినాడని మా విచారణలో తెలగానే ఈ కేసు నుండి అట్టి వ్యక్తి పేరును కేసు నుండి తొలగించనైనది . ఈ మద్యనే అనగా తేదీ:08.11.2024 నాడు ఇదే కేసుకు సంబందించి మళ్ళీ భూ వివాదం జరగగా మళ్ళీ నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా cr.no 292/2024 u/s 329(3),324(4),352,351(2) R/w 3(5) BNS of Narsapur గా కేసు నమోదు చేయడం జరిగినది.ఇట్టి విషయంలో మళ్ళీ కేసు నమోదు కావడంతో ఒక వర్గం వారు పోలీస్ వారిని అబాసుపాలు చేసేలా మీడియా, సోషల్ మీడియాలో చనిపోయిన వ్యక్తి పై FIR నమోదు అని తప్పుడు ప్రచారం చేస్తూ వార్తలు రావడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని *ఈ విషయంలో పోలీస్ వారిది ఎలాంటి తప్పు లేదని ఫిర్యాదుదారుడు ఇచ్చిన ఫిర్యాదులో చనిపోయిన వ్యక్తి పేరు ఉన్నదని అది మా విచారణలో అతడు చనిపోయాడని తెలవగానే అట్టి వ్యక్తి పేరును కేసు నుండి తొలగించడం జరిగిందని అన్నారు.* ఈ కేసుకు సంబందించి ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసే వారి పై పూర్తి విచారణ చేపట్టి అందుకు కారణం అయిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అన్నారు. ప్రజలు ఎవరు కూడా మీడియా, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని పోలీస్ శాఖా ఎల్లప్పుడూ చట్ట ప్రకారం నడుచుకుంటుందని బాదితులకు అండగా ఉంటుందని అన్నారు.

0
183 views