logo

చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు..

చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు..

-పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలి

-ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలి

-చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు

-అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మవద్దు

-గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పిల్లలకి తెలిసి ఉండాలి

-విద్యార్థి దశలో క్రమశిక్షణ చాలా ముఖ్యం

-సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది.

-అవసరం మేరకు మాత్రమే సెల్ ఫోన్ ఉపయోగించాలి

జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్.

మీడియా టుడే మెదక్ జిల్లా ప్రతినిధి బైండ్ల లక్ష్మణ్, 21.11.2024:

మెదక్ జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఐ.పి.ఎస్. ఆదేశానుసారం అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవం సందర్బంగా చేగుంట కేజీబీవీ లో మరియు మెదక్ పట్టణంలోని సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీలో షి టీమ్ మరియు భరోసా సెంటర్ వారి ఆధ్వర్యంలో పిల్లలకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మరియు pocso చట్టము గురించి వివరించడం జరిగింది. భరోసా కేంద్రం అందిస్తున్న సేవల గురించి వివరించడం జరిగింది. పిల్లలకు ఆపద వచ్చినపుడు హెల్ప్ లైన్ నంబర్స్ డయల్ 100, 1098 ని సంప్రదించాలని తెలియజేసారు. అలాగే విద్యార్థులకు మహిళల రక్షణ చట్టాల గురించి, భరోసా మరియు షీటీమ్ నిర్వహిస్తున్న విధుల గురించి, ర్యాగింగ్/ ఈవ్ టీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలు, నూతన చట్టాల గురించి, మరియు అపరిచిత వ్యక్తుల యొక్క ఫోన్ కాల్స్ మరియు మాటలు నమ్మవద్దు, సోషల్ మీడియాకు ఎంత దూరం ఉంటే భవిష్యత్ అంత మంచిగా ఉంటుంది అని వివరించడం జరిగినది.
మెదక్ జిల్లా భరోసా మరియు షీటీమ్ ఆడపిల్లలు, మహిళల భద్రతకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని బాలికలు మహిళల భద్రత మా ముఖ్య బాద్యత. చదువుకునే సమయములో చెడు అలవాట్లకు బానిస కావొద్దు అన్నారు, ప్రతి ఒక్కరూ చదువుపై దృష్టి సారించాలని తెలిపారు, డ్రగ్స్ మరియు ఇతర మత్తు పదార్థాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. చదువుకోవడం వలన భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను చదివించటానికి తల్లిదండ్రులు చేస్తున్న కష్టాన్ని మనసులో పెట్టుకొని చదువుపై శ్రద్ధ వహించాలని మరియు సామాజిక రుగ్మతల గురించి సెల్ఫోన్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిది సెల్ ఫోన్ వల్ల ఎంత మంచి ఉందో అంత చెడు ఉంది దానికి అలవాటు పడి బానిసలు కావద్దు విద్యార్థి దశ చాలా కీలకం కష్టపడే తత్వం, కష్టపడి చదువుకోవడం చాలా ముఖ్యమని స్కూల్లో, కాలేజీలలో, అమ్మాయిలను ఎవరైనా వేధింపులకు గురిచేసినట్లూ అయితే వెంటనే సమాచారం అందించాలని సూచించారు.
విద్యార్థులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అని ఎవరైనా కొత్త వ్యక్తులు చెప్పే మాయమాటలకు మోసపోవద్దని, సూచించారు. ఉమెన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, ఫోక్సో చట్టాల గురించి బాల్య వివాహాల గురించి, మానవ అక్రమ రవాణా, బాలలను అక్రమ రవాణా, బాలలను అక్రమ దత్తత లాంటివి చేయకూడదని ఇలాంటి అక్రమ రవాణాలు జరిగినట్టు మీకు దృష్టికి వస్తే వెంటనే మెదక్ జిల్లా షీటీమ్ నెంబర్ 8712657963 నెంబర్ కు, లేదా డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం అందించాలని సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.
అలాగే భరోసా సెంటర్, షీటీమ్స్ బృందాలు బాలికల మహిళల విద్యార్థుల భద్రత, రక్షణ కొరకు పనిచేస్తున్నాయని, ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు గురిచేసిన, మానసికంగా, శారీరకంగా హింసించిన, సోషల్ మీడియాలో ఫోటోలను మార్చి వేధింపులకు గురిచేసిన వారి వివరాలను షిటీమ్ పోలీసులకు సమాచారం ఇస్తే ఆకతాయిలను పట్టుకొని వారు మైనర్ గా ఉంటే కౌన్సిలింగ్ ఇవ్వడం, మేజర్ గా అయితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపల్ శ్రీమతి. శ్రీవాని గారు ,సోషల్ వెల్ఫేర్ కాలేజి సిబ్బంది భరోసా సెంటర్ కోఆర్డినేటర్ సౌమ్య , ఎస్.ఐ రాజయ్య ,ASI భారతి గారు,ASI రుక్సాన గారు, మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

0
969 views