logo

నంద్యాల జిల్లా: వి.వో.ఏల మూడు సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలి: సీఐటీయూ

నంద్యాల జిల్లా:
వి వో ఎలా మూడు సంవత్సరాల కాల పరిమితి సర్కులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏపీ వెలుగు వి వో ఏ (యానిమేటర్ల) ఉద్యోగుల సంఘం సీఐటీయూ రాష్ట్ర కమిటీ నంద్యాల పట్టణంలోని నూనెపల్లె బ్రిడ్జి నుండి భారీ ర్యాలీ గా నంద్యాల పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు దాదాపు గంటసేపు ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ ధర్నాకు ఏపీ వివోఏల సంఘం జిల్లా అధ్యక్షులు కే, సోమన్న అధ్యక్షతన జరిగిన ధర్నాకు ముఖ్య అతిథులుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు వీ,యేసు రత్నం ఏపీ వెలుగు వివో ఏ యానిమేటర్ల సంఘం రాష్ట్ర కోశాధికారి ఏ, తిరుపతయ్య సిఐటియు జిల్లా కార్యదర్శి
వీ, బాల వెంకట్ శివరాం లు వి వో ఏ లా మూడు సంవత్సరాల కాల పరిమితి రద్దు చేయాలని వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని బకాయి పడ్డ వేత్తనాలు వెంటనే చెల్లించాలని, అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్రంలో 28 వేల మంది వి వో ఏలు పొదుపు సంఘాల మహిళలకు సేవలు అందిస్తున్నారని గత వైఎస్ఆర్ ప్రభుత్వం మూడుసంవత్సరాలు వివో ఏ గా తొలగించి వారిని వెంటనే తీసుకోవాలని 2019 నవంబర్లో జారీ చేశారని కాల పరిమితి సర్కులర్ రద్దు కోసం ఉద్యోగ భద్రత కోసం పాలసీ గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం పేరుతో తొలగింపులు సాధనకై ఆందోళన దగ్గరికి మీ న్యాయమైన న్యాయమైన డిమాండ్లు డిమాండ్లు పరిష్కరిస్తామని వేతనాలు పెంచుతమని చెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లాలో వి వో ఏ లను దాదాపు 200 మందిని తొలగించారని ఎన్నో సంవత్సరాలుగా సేవలందిస్తున్న వివోఏ లను తొలగించడం సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు చేతనైతే కొత్త ఉద్యోగాలు సృష్టించుకోవాలని ఉన్నవాళ్లను అక్రమ తొలగింపులకు గురి చేయడం వల్ల డోన్ మండలంలో కొత్త బురుజు గ్రామంలో వెంకట్రామిరెడ్డి అనే వివో ఏ రాజకీయ వత్తులతో నువ్వు ఉద్యోగం మానుకో మా వాళ్ళు ఎక్కుతారు అని చెప్పడం వల్ల భాగోద్వేగానికి గురి అయి స్టాక్ వచ్చి చనిపోయాడని ఆ కుటుంబాన్ని ఎవరు కాపాడుతారని వారు అన్నారు వెంకట్రాంరెడ్డి చనిపోవడానికి కారణమైన ఈ జిల్లాలోని వెలుగు అధికారులేనని అన్నారు వెలుగు మరియు రాజకీయ నాయకులలే బాధ్యత వహించాలన్నారు ఇప్పటికైనా రాజకీయ వేధింపులు అక్రమ తొలగింపులు ఆపాలని అక్రమంగా తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని లేకపోతే సిఐటియు ఏపీ వెలుగు యానిమేటెడ్ ఉద్యోగుల సంఘం సిఐడియూ గా ఆందోళన ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ఏపీ వెలుగు యానిమేటర్ల సంఘం జిల్లా నాయకులు జిల్లా నాయకులు శంకరయ్య,నాగవర్ధన్, లక్ష్మీనారాయణ, గుండాలయ్య మధుశేఖర్, వెంకటరమణ, సుబ్రహ్మణ్యం, మునిస్వామి, రమణ, లక్ష్మయ్య, శ్రీనివాసులు నాయకత్వం వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 500 మంది విఓఏ పాల్గొన్నారు అనంతరం
అనంతరం నంద్యాల డిఆర్ఓ శ్రీ రామ్ నాయక్కి సమస్యలతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

29
4270 views