AMC ఛైర్మన్ గా ఆదివాసులకు రిజర్వేషన్ లను కొనసాగించాలి.
అదిలాబాద్ జిల్లాలో గత కొంత కాలంగా జైనద్ మరియు అదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లను గత ప్రభుత్వం ఆదివాసుల కోసమని రిజర్వేషన్ లను
తీసుకొచ్చింది. కానీ ఈ రిజర్వేషన్ లను గతం లో ఉన్న బి ఆర్ యస్ ఎంఎల్ఏ వారి స్వార్థ రాజకీయాల కోసం అట్టి రిజర్వేషన్ లను ఆదివాసులకు ఇవ్వ కుండా కాలయాపన చేశారు. అట్టి రిజర్వేషన్ లను ఆదివాసీ నాయకులు పొరటాలు చేసి సాధించుకున్నారు.
కానీ ఈ రోజు ఆదివాసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అట్టి రిజర్వేషన్ లను తొక్కుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాగానే ఆదివాసీ రిజర్వేషన్ లను తొంగలో తొక్కి ఆదివాసీ హక్కులను దెబ్బతిశారు. ఇవాళ్ళ జైనద్ మరియు అదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ లను జైనద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇస్తున్నరు. అదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు జైనాద్ మండలానికి చెందిన వ్యక్తికి అప్పజెప్పడం అంటే ఇది దేనికి నిదర్శనమే కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. ఒకవైపు ఆదివాసీ రిజర్వేషన్ లను తుంగలో తొక్కి అదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కూడా జైనద్ మండలానికి చెందిన వ్యక్తికి అప్ప జెప్పడం ఎంతవరకు సమంజసమో దీనికి కంది శ్రీనివాస్ రెడ్డి సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అదిలాబాద్ మార్కెట్ పరిదిలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ కార్యకర్తలు లేరా నికు తెల్వద లేదనుకుంటే ఆదివాసులు అదిలాబాద్ ప్రాంతం లో లేరా అనేది నికు తెల్వక పోతే మ గ్రామాలలో రా మేము చూపిస్తము. కానీ ఇలాంటి చిల్లర పనులు మని, అదిలాబాద్ సీనియర్ నాయకులకు అదిలాబాద్ మార్కెట్ కమిటీ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
లేని పక్షంలో లో కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నాయకునికి ఆదివాసీ గ్రామాలలో రానియ్య కుండా అడ్డుపడతమని హెచ్చరిస్తున్నాం. ఇంతకు మించి పోయింది ఏమి లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులే మీరు స్పందించి వెంటనే ఆదివాసీ రిజర్వేషన్ లను కొనసాగించాలని , మరియు అదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని అదిలాబాద్ రూరల్ మండల వాసి అయిన ఆదివాసులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్య్రమంలో కుంరా జంగు పటేల్ , కుంరా గులాబ్ , ఆర్కా శేష్రావు. , ముర్తుజా ఖాన్ , కినాక సురేష్ నాయకులు పాల్గొన్నారు