సర్వేను త్వరగా పూర్తి చేయాలి అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి
పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి, కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను త్వరగా పూర్తి చేయాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) డి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం మద్నూర్ మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో మండల తహసీల్దార్, ఎంపీడీవో, ఎంపీవో లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగు తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. సర్వే ద్వారా వచ్చిన సమాచారాన్ని వెంట వెంటనే కంప్యూటర్ లో నమోదు చేయిం చాలని ఆదేశించారు. ఆన్లైన్ చేసే ఆపరేటర్లకు ఇప్పటికే శిక్షణ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పూర్తి అయిందన్నారు. కంప్యూటర్ లో నమోదు ప్రక్రియను వెంటనే ప్రారం భించాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశం లో తహసీల్దార్ ముజీబ్, ఎంపీడీవో రాణి, ఎంపీవో నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.