logo

యాంటీ బయోటిక్స్ ఎక్కువ వాడొద్దు డా.ఉమాకాంత్..

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, జుక్కల్ నియోజకవర్గం ప్రతినిధి, కామారెడ్డి జిల్లా : జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడఫల్ ప్రభుత్వాసుపత్రిలో యాంటీ బయటిక్స్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు డా. ఉమాకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో ప్రజలు యాంట బయాటిక్స్ మందులను విపరీతంగా వాడుతున్నారన్నారు. వాటిని అవసరం మేరకు మాత్రమే వినియోగించాలని తెలిపారు. అతివినియోగంతో కొత్త సమస్యలు ఎదుం "వుతాయని సూచించారు. యాంటీబయోటిక్స్ వాడకం తప్పనిసరి అయితే డాక్టర్ల సూచనల మేరకే వాడాలని అన్నారు. అనంతరం సిబ్బంది, ప్రజలతో ప్రతిజ్ఞ చేయిం చారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

1
0 views