నేరాలను నియంత్రణ మరియు చేదించడంలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 19:
ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఇందులో భాగంగా పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన 43 సీసీ కెమెరాలను అనుసంధానం చేస్తూ ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ నేరాలను నియంత్రించడంలో మరియు నేరాలు ఛేదించడంలో సీసీ కెమెరాలు పాత్ర కీలకమని అన్నారు. జిల్లాలో ఇప్పటికే సీసీ కెమెరాలు సహాయంతో చాలా నేరాలను ఛేదించడం జరిగిందని తెలిపారు.జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలియజేసారు.అనంతరం పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి అక్కడ నమోదైన పలు కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఎప్పటికప్పుడు పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ వివిధ రకాల సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు అండగా ఉండాలని తెలిపారు.పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు,సమస్యాత్మక వ్యక్తులు మరియు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.అనంతరం పోలీస్ స్టేషన్లో పనిచేసే అధికారులు మరియు సిబ్బంది సమస్యల గురించి అడిగి తెలుసుకుని వాటి పరిష్కారాన్ని కృషి చేస్తామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,సీఐ వినయ్ కుమార్,ఎస్బి ఇన్స్పెక్టర్ నాగరాజు,ఎస్ఐలు సుమన్,రాఘవయ్య,జీవన్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు.