త్వరలో విమానాశ్రయం కల సాకారం కాబోతోంది
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నవంబర్ 19:
కొత్తగూడెం : ఎన్నోయేండ్లుగునా అపరిష్కృతంగా వున్నా సమస్యలకు శాశ్వత పరిస్కారం చెప్పేవిధంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అందుకు కావలసిన నిధులను రాబడుతున్నామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని డిఏంఎఫ్ నిధులతో 2 వ వార్డులో రూ.70లక్షల వ్యయంతో నిర్మించనున్న ఎన్పవర్మెంట్ కేంద్రానికి, 24వ వార్డులో రూ.50లక్షలతో నిర్మించనున్న సిసి డ్రైన్ నిర్మాణానికి, 25వ వార్డులో రూ.30లక్షల వ్యయంతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి మంగళవారం అయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సమావేశాల్లో కూనంనేని మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిస్కారంకోసం కృషి చేస్తున్నామని, అభివృద్ధి పనులకు కావాల్సిన నిధులను ప్రభుత్వంతో కోట్లాది రాబడుతున్నామన్నారు. ఏ నియోజకవర్గంలోలేని విధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రానికి విమానాశ్రయం సాధించాలనే కల త్వరలో సాకారం కాబోతోందని, విమానాశ్రయం ఏర్పాటుతో మహా నగరాలకు ధీటుగా కొత్తగూడెం పట్టణంతోపాటు నియోజకవర్గం సమగ్రంగా అభివృద్ధి సాదిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం, రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, త్రాగునీరు వంట కనీస మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక ద్రుష్టి సారించినట్లు చెప్పారు. కొత్తగూడెం మున్సిపల్ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను నాణ్యతగా, వేగవంతంగా చేపట్టాలని, అధికారులు, ప్రజలు అభివృద్ధి పనులపై ద్రుష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ, కమిషనర్ శేషాంజన్ స్వామి, ఇంచార్జి తహసీల్దార్, డీఈ రవికుమార్, కౌన్సిలర్లు వేల్పుల దామోదర్, సత్యభామ, సహేరా బేగం, బోయిన విజయ్ కుమార్, పి సత్యనారాయణాచారి, నాయకులు యూసుఫ్, మాచర్ల శ్రీనివాస్, అజీజ్, అబ్దుల్ రహమాన్, రోహిని నాథ్, బండారి రాములు, నేరెళ్ల రమేష్, కటుకూరి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.