నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ :
మెగా DSC విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలం: AIYF నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాముడు*
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ:
AIYF ఆళ్లగడ్డ నియోజకవర్గం నూతన కమిటీ సమావేశం ఆళ్లగడ్డ పట్టణంలోని సిపిఐ కార్యాలయం నందు AIYF నాయకులు మధు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిదులుగా AIYF నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాముడు, సిపిఐ ఆళ్లగడ్డ తాలూకా కార్యదర్శి భాస్కర్ లు పాల్గొన్నారు.సమావేశం అనంతరం ఆళ్లగడ్డ నియోజకవర్గ AIYF అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 5 మందితో నూతన కమిటీని AIYF నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాముడు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణం సిపిఐ కార్యాలయంలో జరిగిన ఏఐవైఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో AIYF నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాముడు మాట్లాడుతూ కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని వారు ఆరోపించారు. వివిధ శాఖలో రాష్ట్రంలో అనేక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఏమాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగుల కడుపు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో యువతకు అనేక రకాల హామీలు ఇచ్చి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు వందరోజుల పాలన పూర్తయినటువంటి నేపథ్యంలో ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల చేయకుండా నిరుద్యోగులను నట్టేట ముంచడం బావ్యం కాదని వారు హెచ్చరించారు. కావున కూటమి ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేసి మెగా డీఎస్సీ ద్వారా రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఆయా జిల్లాల్లో స్థానికంగా ప్రభుత్వ పరిశ్రమలు నెలకొల్పి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగ అవకాశాలు కల్పించలేని పక్షంలో ప్రతి నిరుద్యోగికి నెలకు 5000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధమవుతాని వారు హెచ్చరించారు.
సమావేశం అనంతరం ఆళ్లగడ్డ నియోజకవర్గ AIYF నూతన కమిటీని 7 మందితో ఆళ్లగడ్డ తాలూకా AIYF నూతన కమిటీని జిల్లా కార్యదర్శి నాగరాముడు, ఆళ్లగడ్డ సిపిఐ కార్యదర్శి భాస్కర్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో AIYF ఆళ్లగడ్డ తాలూకా నాయకులు సురేష్, చంద్రబాబు, శేఖర్ రమణ తదితరులు పాల్గొన్నారు.