logo

దళారుల చేతిలో మోసపోవద్దు జుక్కల్ ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పెద్ద కొడఫ్గల్ మండల కేంద్రంలో సోమవారం మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,ప్రభుత్వం సోయా పంటకు క్వింటాలుకు రూ.4,892 రూపాయల మద్దతు ధర ప్రకటించిందని చుట్టుపక్కల రైతులు సోయా బీన్ పంటను పెద్ద కొడఫ్గల్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి విక్రయించాలని కోరారు. గతంలో ముందు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి ఆరు క్వింటాళ్లు మాత్రమే సేకరణ జరిగేదని తాను ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రిని ధాన్యం కొనుగోలు పై చర్చించి సోయా రైతుల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకు వెళ్లాను అని అందువల్ల ఎకరానికి పది క్వింటాళ్లు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కాబట్టి రైతులు అందరూ. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు,స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు,రైతులు,ప్రజలు పాల్గొన్నారు.

56
3726 views