logo

అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఎస్ఐ సస్పెండ్

మహబూబ్ నగర్ జిల్లాలో వి ఆర్ లో వున్న ఎస్ఐపి బాల వెంకట రమణ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇంతకుముందు 29-01-2021 నుండి 05-02-2024 వరకు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన సమయంలో 10 మంది పై 23 అక్రమ కేసులు బనాయించి మరియు ఆయన పిటిషనర్లను వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడం, ఇతరులతో కలిసి పిటిషనర్లపై తనకు రాజ్యాంగం కలిగించినటువంటి అధికారాలను దుర్వినియోగం చేయడం, కొట్టడం, హింసించడం మరియు విచక్షణారహితంగా కేసులు నమోదు నమోదు చేయడం లాంటివి చేసారని పిటిషనర్స్ డీజీపీ గారికి ఫిర్యాదు చేసుకొనగా, దానిపై శ్రీ జితేందర్, ఐపీఎస్, డి జి పి, తెలంగాణ హైదరాబాద్ వారు విచారణ నిర్వహించిన నిమిత్తం ఇట్టి నివేదికను డీజీపీ, సీఐడీ, వారికి ఇవ్వడం జరిగింది. సీఐడీ పూర్తిగా విచారణ జరిపి ఇట్టి ఎస్ఐ పై చేసిన అభియోగాలు పూర్తిగా నిజమని వెల్లడించింది. దాని ఆధారంగానే శ్రీ బాల వెంకట రమణ, ఎస్ఐపి ను శ్రీ వి సత్యనారాయణ, ఐపీఎస్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మల్టీ జోన్, వారు విధులనుండి సస్పెండ్ చేశారు.

117
4867 views