logo

నంద్యాల జిల్లా క్రైమ్: ఎన్ఫోర్స్మెంట్ పై ప్రత్యేక దృష్టి వల్నరబుల్ ఏరియాలలో విస్తృత తనిఖీలు. *జిల్లావ్యాప్తంగా నేడు నేర చరిత్ర గలవారికి రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహణ...

నంద్యాల జిల్లా క్రైమ్ :
ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించిన అటువంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని మరియు జిల్లాలో నేర నియంత్రణ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పట్టణ శివారు ప్రాంతాలలో మరియు గ్రామాలలో వల్నరబుల్ ఏరియాలలో గడిచిన 24 గంటలలో పోలీస్ అధికారులు వారి సిబ్బంది సహాయంతో మరియు ప్రతి సబ్ డివిజన్ నందు గల డ్రోన్ కెమెరాల సహాయంతో అసాంఘిక శక్తులకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని కట్టడి చేయడానికి తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్, విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా తెలియజేశారు.
➡️ప్రజల ఆరోగ్యానికి హానికరమైనటువంటి నాటు సారాయిని నియంత్రించుటలో భాగంగా జిల్లావ్యాప్తంగా రెండు కేసులు నమోదు చేయడంతో పాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 37 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది.
➡️బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం నేరమని తెలియజేస్తూ గడిచిన 24 గంటలలో 71 కేసులు నమోదు చేయడంతో పాటు బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయుచున్న వారిపై 62 కేసులు నమోదు చేసి 5810 రూపాయలు జరిమాన విధించడం జరిగింది.
➡️మోటారు వాహన చట్టాన్ని ఉపయోగించి గడిచిన 24 గంటల్లో డ్రైవింగ్ లైసెన్స్ మరియు వాహన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడిపే 423 మందిని గుర్తించి 2,33,585/-రూపాయలను జరిమానా విధించడం జరిగింది మరియు మద్యం సేవించి వాహనాలు నడిపే 25 మందిని గుర్తించి 21 వాహనాలను తదుపరిచర్య నిమిత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది.
➡️ప్రజల జీవితాలను నాశనం చేసే మట్కా ,జూదం మొదలగు వాటిపై దాడులు చేసి శిరివెళ్ల ,నంద్యాల 1 టౌన్,కొలిమిగుండ్ల మొదలగు పోలీస్ స్టేషన్ల పరిధులలో మట్కా అడుచు వాటి వైపు ఆకర్షించే విధంగా చేయుచున్న వారిపై 03 కేసులు నమోదు 04 అరెస్టు చేసి వారి వద్ద నుండి 29,616/-రూపాయలను తదుపరి చర్య నిమిత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది.అంతేకాక డోన్ రూరల్ పోలీస్ స్టేషన్, బేతంచెర్ల ,నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై రాబడిన సమాచారం మేరకు దారులు చేసి 03 కేసులు నమోదు చేసి 17 మందిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి 1,29,040/-రూపాయలను తదుపరి చర్య నిమిత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది.

3
968 views