logo

ఘనంగా రాజాం తెలగా కులస్తుల కార్తీక వనమహోత్సవం



*తెలగ సంక్షేమ సంఘం ఐక్యతగా ఉండి తమ హక్కుల్ని కాపాడుకోవాలి*

విజయనగరం జిల్లా. రాజాం.

రాజాం పట్టణంలో ఆదివారం నాడు బొబ్బిలి రోడ్డులో మెంతిపేట అద్దంకి వారి తోటలో తెలగ కులస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జనసేన నాయకులు,ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ తమ్మిరెడ్డి శివశంకర్, విజయనగరానికి చెందిన పివిఆర్ తదితరులు విచ్చేశారు. వన మహోత్సవానికి వీరికి కమిటీ సభ్యులు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందించి దుస్సలువాలతో వీరికి సన్మానించారు. వీరు మాట్లాడుతూ తెలగ సంక్షేమ సంఘం ఐక్యంగా ఉండాలని తమ హక్కులను సాధించుకోవాలని తెలిపారు. తెలగ సంఘం సభ్యులు తమ కుటుంబాలతో వచ్చి ఉల్లాసంగా గడిపారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. వన సమారాధనల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. సుమారు 9 మండలాల నుండి 8,000 వేల మంది వనమోత్సవంలో పాల్గొన్నారు. వన మహోత్సవ ప్రాంగణంలో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడంతో పలువురు వారి వారి పిల్లలు యొక్క వివరాలు నమోదు చేశారు. తెలగ కులస్తులు అందరూ కలిసి బ్రహ్మాండంగా వనమహోత్సవం జరుపుకున్నారు. ముఖ్యంగా వనమహోత్సవ కమిటీ సభ్యులు, యువత అందరూ కలిసి వన మహోత్సవాన్ని విజయవంతం చేశారు. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా కమిటీ సభ్యులు తగు ఏర్పాటు చేశారు. వనమహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

212
9365 views