**ప్రభుత్వాలు మారుతున్న మారని మైలవరం రిజర్వాయర్ దుస్థితి.? DYFI
గత కొన్నేళ్లుగా పాలకులు మారుతున్నా, ప్రభుత్వాలు మారుతున్నా మైలవరం జలాశయం దుస్థితి లో ఎటువంటి మార్పు జరగడం లేదని DYFI జిల్లా కార్యదర్శి వీరణాల.శివకుమార్ తెలిపారు.ఆదివారం DYFI బృందం మైలవరం జలాశయం ఆనకట్ట ను పరిశీలించారు
ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ మైలవరం జలాశయం చూడటానికి సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు,స్కూల్ విద్యార్థులు వస్తువున్నారు,.పక్కనే పర్యాటక ప్రాంతం అయిన గండికోటను చూడటానికి వచ్చి ఇటు మైలవరం జలాశయం ను కూడా సందర్శిస్తున్నారు .కానీ వచ్చిన పర్యాటకులకు,సందర్శకులకు మైలవరం జలాశయం పైన వున్న పరిస్థితి చూసి పలు రకాలుగా వాపోతున్నారు.కనీసం జలాశయం పైన ఆనకట్ట కు సేఫ్టి వాల్ కూలిపోయి ప్రమాదకరం గా వుంది అన్నారు.రిజర్వాయర్ గేట్ల పైన కూడా రక్షణ గోడ లేక ప్రజలు,పర్యాటకులు,సందర్శకులు తీవ్ర ఇబ్బందులకు,భయాందోళనకు గురి అవుతున్నారు అన్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఎలా అని అన్నారు.ఆనకట్ట పై రోడ్డు కూడా సరిగ్గా లేదని అన్నారు.రాత్రి సమయం అయితే కట్ట పైన లైట్లు కూడా లేని పరిస్థితి అన్నారు.అలాగే నైట్ వాచ్మెన్ కూడా జలాశయం పైన కాపలాగా లేరు. చాలామంది ఆత్మహత్యలు కూడా జరిగిన సంఘటనలు వున్నాయని, పాలకులకు తెలిసిన కంటికి కనపడుతున్న సమస్యలను పట్టించుకోని దుస్థితి.
88 కోట్ల రూపాయలకు మరమ్మతులకు
ప్రతిపాదనలు పంపిన ఇప్పటివరకు అనేక రకాల సాకులతో గతంలో ప్రతిపాదనలు వెనక్కి పంపారు. కొత్త ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు అతి గతి లేదు.కనీసం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో కూడా నిరాశే మిగిలింది .కావున కూటమి ప్రభుత్వం అయినా స్పందించి మైలవరం జలాశయం ఆనకట్ట,రోడ్లు,గేట్లు,సేఫ్టీ వాల్ ఇతర మరమ్మతులకు నిధులు కేటాయించి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరుతున్నాం DYFI .
కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్,నాయకులు సాయి,మహేష్,సురేంద్ర,రాఘవ,నరసింహ,అంజి తదితరులు పాల్గొన్నారు.